NTV Telugu Site icon

Ronald Rose: హైదరాబాద్లో కౌంటింగ్ కేంద్రాల పరిశీలన.. కౌంటింగ్కు అంతా సిద్ధం

Ronald Rose

Ronald Rose

హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో.. శనివారం సికింద్రాబాద్ వెస్లీ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను ముందుగా పరిశీలించారు. అనంతరం అంబర్ పేట్ జీహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మలక్ పేట్ కౌంటింగ్ సెంటర్, ప్రొ.జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కౌంటింగ్ సెంటర్, దోమలగూడ ఏ.వి కాలేజ్ లో ఏర్పాటు చేసిన ముషీరాబాద్ కౌంటింగ్ సెంటర్, నారాయణగూడ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ (జి.ఎఫ్ అండ్ ఓపెన్ గ్రౌండ్) ఏర్పాటు చేసిన అంబర్ పేట్ కౌంటింగ్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పరిశీలించారు. అనంతరం.. ఉస్మానియా యూనివర్సిటీ  కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో ఏర్పాటు చేసిన సనత్ నగర్ కౌంటింగ్ సెంటర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యాతో కలిసి ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ పరిశీలించారు.

Actress Subbalakshmi: సీనియర్ నటి సుబ్బలక్ష్మి చివరి క్షణాలు.. వీడియో షేర్ చేసిన మనవరాలు

ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… కౌంటింగ్ సెంటర్ లోకి ఎవ్వరికీ సెల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు. ఏజెంట్లు, కౌంటింగ్ నియమించిన సిబ్బంది అందరూ ఉదయం 5 గంటల వరకు కౌంటింగ్ సెంటర్ కు రావాలని తెలిపారు. కౌంటింగ్ కు 14 టేబుల్ ఏర్పాటు చేయగా.. మూడంచెల బందోబస్తు, మొదటి దశలో సివిల్ పోలీస్, రెండవ దశలో స్టేట్ ఆర్మీ పోలీస్, మూడవ దశలో కేంద్ర బలగాలు ఉంటాయని తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఉదయం 9 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. ఉదయం 9:30 గంటలకు మొదటి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు ముగుస్తుందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఒక్కో నియోజకవర్గానికి ఒక సాధారణ పరిశీలకులను నియమించిందని, సాధారణ పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని రోనాల్డ్ రోస్ తెలిపారు.