Site icon NTV Telugu

Lok Sabha Elections: ఏప్రిల్ 16న లోక్ సభ ఎన్నికలు..? ఈసీ రియాక్షన్ ఇదే..!

Ec

Ec

భారత్‌లో ఎన్నికల వాతావరణం మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు తుది తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించలేదు.. ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది అనే తప్పుడు వార్తను ఈసీ ఖండించింది. అయితే, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అని ఈసీ తెలిపింది. అందులో ఫిబ్రవరి 16వ తేదీన ఎలక్షన్ కోడ్ రాబోతుంది.. మార్చ్ 16 నాటికి టిక్కెట్ల పంపిణీతో పాటు ఏప్రిల్ 16న తుది ఎన్నికలు జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై ఈసీఐ మాట్లాడుతూ.. ఆ మెస్సేజ్ నకిలీది.. తేదీలను ఎలక్షన్ కమిషన్ ఇంకా ప్రకటించలేదని పేర్కొంది.

Read Also: Hyderabad Student: చికాగోలో హైదరాబాద్‌ విద్యార్థిపై దాడి.. కేంద్రం సాయం కోరిన కుటుంబ సభ్యులు!

ఇక, ఎన్నికలకు గరిష్టంగా 125 రోజులు మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల తేదీలు ప్రకటించకముందే రాజకీయ పార్టీలు సన్నాహాలను ముమ్మరం చేశాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) 400 సీట్లకు పైగా గెలుస్తుందని భారతీయ జనతా పార్టీ పేర్కొనింది. ఇక, బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి సిద్ధమైంది. మా ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి కూడా ఎంతో దూరంలో లేదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్డీయే కూటమి 400 సీట్లు దాటే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Exit mobile version