Hyderabad Student: చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి.. కేంద్రం సాయం కోరిన కుటుంబ సభ్యులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Student Attacked By Four Men In Chicago: అమెరికాలో మరో భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. హైదరాబాద్ లంగర్‌హౌజ్ హషీమ్‌నగర్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీపై చికాగోలో దాడి జరిగింది. హోటల్ నుంచి ఇంటికెళ్తున్న మజాహిర్ అలీపై నలుగురు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో అతడి తల, ముక్కు, కళ్లపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గత శనివారం (ఫిబ్రవరి 4) చికాగోలోని క్యాంప్‌బెల్ ఏవ్‌లో జరిగింది.
హైదరాబాద్ విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీ.. ఇండియానా వెస్లే యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఆరు నెలల క్రితం హైదరాబాద్ నుంచి అమెరికాకు ఉన్నత చదువు కోసం వెళ్ళాడు. గత శనివారం క్యాంప్‌బెల్ ఏవ్‌లోని హోటల్ నుంచి ఆహరం తీసుకుని ఇంటికి వెళుతుండగా.. రోడ్డుపై నలుగురు దుండగులు దాడి చేశారు. తీవ్రంగా కొట్టి, గన్‌తో బెదిరించి అతడి ఫోన్ మరియు వాలెట్‌ను ఎత్తుకెళ్లారు.
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
తనపై జరిగిన దాడిని సయ్యద్ మజాహిర్ అలీ వీడియో ద్వారా వెల్లడించాడు. చికాగోలోని కాంప్‌బెల్‌లో ఇంటి వద్ద అతణ్ని దుండగులు వెంబడించిన సీసీ కెమెరా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. తమకు సాయం చేయాలని మజాహిర్ అలీ కుటుంబ సభ్యులు ప్రధానిని కోరారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న అలీ భార్య అమెరికా వెళ్లేందుకు సహాయం కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను సంప్రదించారు.
A Hyderabadi student, pursuing masters degree at Indiana #WeslayUniversity in Chicago was seriously injured in an attack by armed robers near his house at Campbell Ave, Chicago.
The victim was identified as Syed Mazahir Ali, a resident of Langar Houz, #Hyderabad, #Telangana. pic.twitter.com/DVeJdj5JBM
— Hate Detector 🔍 (@HateDetectors) February 6, 2024
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!