IMD: భారత్‌కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMD: ప్రస్తుత నైరుతి రుతుపవనాల కాలంలో భారత్‌కు ఒక కీలకమైన హెచ్చరిక వెలువడింది. పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ (El Nino) పరిస్థితులు అధికారికంగా ప్రారంభమయ్యాయని భారత వాతావరణ శాఖ (IMD) తన జూన్ 2026 బులెటిన్‌లో స్పష్టం చేసింది. సాధారణంగా ఎల్ నినో అంటేనే భారతీయ రైతులకు, వాతావరణ నిపుణులకు గుండెల్లో రాయి పడ్డట్లే. ఎందుకంటే దీని ప్రభావం వల్ల దేశంలో వర్షాలు తగ్గిపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, తీవ్రమైన అనావృష్టి లేదా కరవు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉంటుంది.
ప్రస్తుతం కేంద్ర, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతూ ఎల్ నినో స్థాయిని దాటేశాయి. కేవలం సముద్రపు నీరు వేడెక్కడం మాత్రమే కాకుండా, దానికి తగ్గట్టుగా వాతావరణంలోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే సముద్రం, వాతావరణం రెండూ కలిసి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎల్ నినో వైపు అడుగులు వేశాయని వాతావరణ శాఖ విశ్లేషించింది. ఎల్ నినో తీవ్రతను కొలిచే కీలకమైన ‘నినో 3.4 ఇండెక్స్’ సగటు గడిచిన మూడు నెలల్లో +0.5 డిగ్రీల సెల్సియస్ దాటడంతో దీని రాక అధికారికంగా ఖరారైంది.
Also Read
- Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
- Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
- IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
- Cyclone Akvan: ఆంధ్రప్రదేశ్ వైపే వరస తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది.?
నిజానికి ఇది ఇక్కడితో ఆగేలా లేదు. పసిఫిక్ మహాసముద్రం లోపలి పొరల్లో కూడా విపరీతమైన వేడి ఉంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మరింత వేడి నీరు పైకి వచ్చి, ఎల్ నినోను మరింత బలపరిచే అవకాశం ఉంది. జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో పసిఫిక్ వ్యాప్తంగా ఈ వేడి మరింత విస్తరించి, జూలై తర్వాత ఇది మరింత తీవ్ర రూపం దాల్చవచ్చని మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ (MMCFS) అంచనా వేస్తోంది. ఈ నైరుతి రుతుపవనాల సీజన్ అంతటా ఇది ‘మధ్యస్థం నుంచి తీవ్ర’ స్థాయిలో కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ నమూనాలు చెబుతున్నాయి.
అయితే, ఎల్ నినో వచ్చినంత మాత్రాన రుతుపవనాలు పూర్తిగా దెబ్బతింటాయని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశ వర్షపాతాన్ని శాసించే మరో కీలక అంశం ‘ఇండియన్ ఓషన్ డైపోల్’ (IOD). ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఐఓడీ పరిస్థితులు తటస్థంగా (Neutral) ఉన్నాయి. ఈ తటస్థ స్థితి వల్ల ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడానికి కానీ, లేదా మరింత పెంచడానికి కానీ దీని నుంచి ఎటువంటి మద్దతు లభించదు. కానీ, ఈ ఆందోళనల మధ్య జపాన్ వాతావరణ సంస్థ (JMA) ఒక ఆశాజనకమైన విషయాన్ని తెరపైకి తెచ్చింది. జూన్ 11నే ఎల్ నినో ప్రారంభాన్ని ప్రకటించిన జపాన్ శాస్త్రవేత్తల ప్రకారం… రాబోయే జూలై నాటికి హిందూ మహాసముద్రంలో ‘పాజిటివ్ ఐఓడీ’ (Positive IOD) ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, పసిఫిక్‌లో ముంచుకొస్తున్న ఈ ‘సూపర్ ఎల్ నినో’ సృష్టించబోయే విధ్వంసాన్ని, నష్టాన్ని పాజిటివ్ ఐఓడీ కొంతవరకు అడ్డుకుని, భారతదేశానికి రక్షణ కవచంగా మారే అవకాశం ఉంది. రాబోయే కాలంలో పసిఫిక్, హిందూ మహాసముద్రాలలో మారబోయే ఈ వాతావరణ పరిస్థితులను నిరంతరం నిశితంగా గమనిస్తూ, ప్రతి నెలా అప్డేట్స్ ఇస్తామని భారత వాతావరణ శాఖ భరోసా ఇచ్చింది. అంతా సవ్యంగా సాగి, ప్రకృతి భారతావనికి మేలు చేయాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్‌లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
-
Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
-
Vijay Antony : లక్షల విలువైన స్మార్ట్ వాచ్‌లు విసిరేసి చనిపోయిన కూతురి వాచ్‌తో విజయ్ ఆంటోనీ
-
IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!