Site icon NTV Telugu

IMD : దేశంలో ఎల్‌నినో తగ్గింది.. అసలు ఎల్‌నినో అంటే..?

Monsoon

Monsoon

IMD : భారత వాతావరణ శాఖ (IMD) తాజా ప్రకటన ప్రకారం, దేశాన్ని ప్రభావితం చేసిన ఎల్ నినో పరిస్థితులు తొలిగిపోయాయి. దీని ప్రభావంతో గత ఏడాది పాటు ప్రతీ సీజన్ ఆలస్యంగా మొదలైందీ కాక, సాధారణ దినాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ వాతావరణ తారతమ్యం తగ్గిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ఈశాన్య భాగంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా పెరిగే ఒక ప్రకృతి తత్వం. ఇది ప్రపంచ వాతావరణ నమూనాలను ప్రభావితం చేసే శక్తివంతమైన ఘటన. దీనివల్ల ముఖ్యంగా భారత్‌లో, ఇతర ఆసియా దేశాల్లో వర్షాలపై, ఉష్ణోగ్రతలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.

Puri : పూరీ-విజయ్‌ సేతుపతి మూవీలో విద్యా బాలన్ పాత్ర ఎంటో తెలుసా..

ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ కంటే నాలుగు రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకనున్నాయని ఐఎండీ పేర్కొంది. మే 13వ తేదీన అండమాన్ ప్రాంతాన్ని తాకిన రుతుపవనాలు, మే 27 నాటికి కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. గత ఏడాది మే 31న రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా వేసినా, అవి ఒక రోజు ముందుగానే వచ్చాయి. ఈసారి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం కంటే సగటున 105 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది వ్యవసాయ రంగానికి శుభవార్తగా మారనుంది. ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగుకు ఇది బాగా ఉపయోగపడనుంది.

Jakkampudi Raja: దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు.. పథకాలకు చరమగీతం పలికారు!

ఈ ఏడాది హైదరాబాద్ నగరానికి కూడా అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో వరదల ముప్పు పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు. నగరంలో తక్కువ స్థాయి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పాత కాలనీల్లో మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలంటూ పిలుపు నిచ్చారు.

Exit mobile version