Site icon NTV Telugu

Global Warming: గ్లోబల్ వార్మింగ్ కాదు.. గ్లోబుకే వార్నింగ్

Global Warming

Global Warming

Global Warming: ఎమినిది సంవత్సరాల నుంచి భూమి మండిపోతుంది. సూర్యుడి నుంచి వస్తున్న ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ వాతావరణ అధ్యయన నివేదికలో తెలిపింది. 19వ శతాబ్దం ప్రారంభమైనప్పటి నుండి అత్యంత వేడి నమోదైన ఐదవ సంవత్సరంగా 2022 నిలిచింది. ఎల్‎నినో ఏర్పడడమే ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణంగా నిపుణులు భావిస్తున్నారు.

Read Also: Harassment : ‘నా మొగుడు.. నా పళ్లు ఊడగొట్టాడు’.. పరిహారం కోసం కోర్టుకెక్కిన మహిళ

2022 చివరి రెండు నెలల్లో అత్యంత వేడి నమోదైంది. ఈ నెలల్లో, పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ కూడా 2022లో వేడి రికార్డులను బద్దలు కొట్టాయి. ఐరోపాలో, వాతావరణ ఉష్ణోగ్రత రికార్డులు ప్రారంభమైనప్పటి నుండి 2022.. రెండవ అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా ఉంది. యూరప్‌లో 30 ఏళ్లలో ప్రపంచ సగటుతో పోలిస్తే రెట్టింపు ఉష్ణోగ్రతలు పెరిగాయి. చైనా, పశ్చిమ ఐరోపాలో తీవ్రమైన వాతావరణ సంక్షోభం వ్యవసాయ రంగం, నీటి సరఫరా, ఇంధన ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేసింది.

Read Also: Russia Ukraine War: సోలెడార్‎ను ఆక్రమించామంటున్న రష్యా.. నీకంత లేదన్న ఉక్రెయిన్

భూమి యొక్క ధ్రువ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. తూర్పు అంటార్కిటికాలో గత 65 ఏళ్లలో ఉష్ణోగ్రతలు 17.7 డిగ్రీల సెల్సియస్‌తో 2022 అత్యంత వెచ్చని సంవత్సరంగా ఉంది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా గ్రీన్‌లాండ్‌లోని మంచు పలకలు కూడా కరిగిపోతున్నాయి. ఇది ప్రపంచ సముద్ర మట్టం పెరుగుదలకు కూడా దారితీసింది. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు ఇప్పుడు అధిక స్థాయిలో ఉన్నాయి. గత ఏడాది ఒక దశాబ్దంలో అత్యధిక ప్రపంచ ఉద్గారాల రేటును చూసింది. ఈ ఏడాది కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version