NTV Telugu Site icon

Tomato Price: ఇండియాలో టమాటా ధరల ఎఫెక్ట్.. దుబాయ్ నుండి ఆర్డర్..!

Tomoto

Tomoto

ప్రస్తుతం ఇండియాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అందులోనూ టమాట ధరలైతే.. ఆకాశాన్ని అంటిని విషయం తెలిసిందే. గత నెలరోజుల నుంచి టమోటా ధరలు విపరీతంగా పెరిగాయి. టమోటా ధరలు పెరగడంతో.. సామాన్య మానవులు వాటిని కొనడమే మానేశారు. మరోవైపు అధిక ధరలు చూసి టమోటాలను దొంగతనం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా టమోటా సాగుతో లక్షాధికారులు అయిన వారు కూడా ఉన్నారు. మొత్తానికి ఇప్పటికి టమాటా ధరలు దిగడం లేదు.

Apple iPhone 15 Series: ఐఫోన్‌ లవర్స్‌కి షాకింగ్‌ న్యూస్..

మరోవైపు టమోటా ధరలపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు టమోటాలకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే బంధువులను టమాటా తీసుకురమ్మనే పరిస్థితి నెలకొంది. ఇండియాలో ఉంటున్న తల్లి.. దుబాయ్ నుంచి వస్తున్న తన కూతురిని టమోటాలు తీసుకురమ్మని చెప్పింది. ఇప్పుడు ఈ వార్తపై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Rashmika Mandanna : ఆ విషయంలో ఇప్పటికీ నేను బాధ పడుతూనే వుంటాను

ఈ కథనాన్ని జూలై 18న @Full_Meals ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘పిల్లలు వేసవి సెలవుల్లో ఉన్నప్పుడు నా సోదరి దుబాయ్ నుండి భారతదేశానికి వస్తోంది, కాబట్టి ఆమె తన తల్లిని దుబాయ్ నుండి మీకు ఏమి కావాలి అని అడిగారు, ఆపై ఆమె బయలుదేరింది. 10 కిలోల టమోటాలు తీసుకురండి మరియు మా అమ్మ మాటకు కట్టుబడి, నేను అక్కడ టమోటాలతో కూడిన సూట్‌కేస్‌ని తీసుకువచ్చాను. అని ట్వీట్ లో తెలిపింది. ఈ కథనం రాసే సమయానికి, ట్వీట్‌ను 53 వేలకు పైగా చూశారు. అంతేకాకుండా ఏడు వందలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాకుండా నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.