11 Overs in ODI: అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ల అజాగ్రత్త.. వన్డేలో 11 ఓవర్లు వేసిన బౌలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eden Carsen became first bowler to bowl 11 overs in ODI: సాధరణంగా ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో 50 ఓవర్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కో జట్టు 50 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉండగా.. ఒక బౌలర్ గరిష్టంగా 10 ఓవర్లు మాత్రమే వేయాలి. ఒక వన్డే మ్యాచ్‌లో ఓ బౌలర్ 10 ఓవర్లకు మించి వేయరాదు. అయితే ఓ మహిళా బౌలర్ ఏకంగా 11 ఓవర్లు వేసింది. ఈ ఘటన తాజాగా శ్రీలంక, న్యూజిల్యాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో జరిగింది. అంపైర్ల అజాగ్రత్త, కెప్టెన్ గమనించకపోవడంతో ఈ తప్పిదం జరిగింది.
గత శుక్రవారం (జూన్ 30) గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో న్యూజిల్యాండ్ మహిళల జట్టు రెండో ఒన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫియా డివైన్ (138), స్టార్ బ్యాటర్ అమీలియా కెర్ (108) సెంచరీలు చేశారు. శ్రీలంక బౌలర్ ఓషది రణసింగ్ మూడు వికెట్స్ తీయగా.. ఉదేశిక ప్రబోధని
2 వికెట్స్ పడగొట్టింది.
Also Read
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
Also Read: Jonny Bairstow Run-Out: మరోసారి ఆస్ట్రేలియా చీటింగ్.. అనూహ్య రీతిలో బెయిర్‌స్టో అవుట్! (వీడియో)
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు 48.3 ఓవర్లలో 213 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దాంతో శ్రీలంకపై న్యూజిల్యాండ్ 111 పరుగులతో విజయం సాధించింది. కవిషా దిల్హరి (84) మినహా మిగతా లంక బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. దిల్హరి అనంతరం టాప్ స్కోరర్ అనుష్క సంజీవని. ఆమె 17 రన్స్ చేసింది. ఇక లంక చేసిన 213 పరుగులలో అదనపు పరుగులే 43 ఉండడం విశేషం. కివీస్ బౌలర్లు ఏకంగా 26 వైడ్స్ ఇచ్చారు.
అయితే అంపైర్ల పొరపాటుతో న్యూజిలాండ్ బౌలర్ ఈడెన్ కార్సన్ ఏకంగా 11 ఓవర్లు బౌలింగ్ చేసింది. అంటే తన కోటాకు మించి ఓ ఓవర్ ఎక్కువగా వేసింది. అంపైర్లు గమనించకపోవడం, కెప్టెన్ చూసుకోకపోవడం సహా కార్సన్ నిర్లక్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో 11 ఓవర్లు బౌలింగ్ వేసిన కార్సన్ 41 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఈ విషయం తెలిసిన ఫాన్స్ అంపైర్లపై మండిపడుతున్నారు. అలానే ఐసీసీపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
తాజావార్తలు
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!