Site icon NTV Telugu

Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ కు ఈడీ షాక్.. నేడే విచారణ

Raina

Raina

Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆగస్టు 13న) ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. అనధికారిక బెట్టింగ్ యాప్‌ 1xBetకి సంబంధించి కొంతమంది ద్వారా మద్దతు ఇచ్చినట్లు అనుమానాలు ఉన్నాయి.. వాటిపై స్పష్టత కోసమే విచారణ జరపాలని ఈడీ భావిస్తోంది.

Read Also: Mahabubabad: బాత్రూమ్ క్లీనర్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం..

అయితే, దేశవ్యాప్తంగా అనధికారిక బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అనేక మంది వినియోగదారులను మోసం చేసి డబ్బును మనీ లాండరింగ్ చేస్తున్నట్లు ఈడీ ఇప్పటికే పలు కేసుల్లో విచారణ చేస్తుంది. ఇటీవల గూగుల్, మెటా సంస్థల ప్రతినిధులను కూడా సమన్లు జారీ చేసి, ప్రత్యామ్నాయ ద్వారా ఈ యాప్‌లు ఎలా ప్రచారం పొందుతున్నాయో వివరాలను తెలుసుకుంది. కాగా, 2025 మొదటి మూడు నెలల్లోనే 1.6 బిలియన్ సార్లు ఈ బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను యూజర్లు సందర్శించారని అంచనా. భారతదేశంలో ఈ మార్కెట్ విలువ సుమారు 100 మిలియన్ డాలర్లుగా ఉందని సమాచారం.

Read Also: Coolie : ఏంటి.. కూలీ సినిమాకి నాగార్జున మ‌రీ అంత తక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారా?

ఇక, ప్రస్తుతం 22 కోట్లకు పైగా భారతీయులు ఈ యాప్‌లను వినియోగిస్తుండగా, వీరిలో 11 కోట్లు రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నారని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం సుమారు రూ. 27,000 కోట్ల పన్ను ఎగవేత జరుగుతున్నట్లు ఈడీ అనుమానిస్తుంది. మరోవైపు, మంగళవారం ‘పారీ మ్యాచ్‌’ అనే మరో యాప్‌పై ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్, జైపూర్, మధురై, సూరత్‌లోని 15 ప్రదేశాల్లో ఈడీ సోదాలు చేసింది. ప్రాథమిక విచారణలో రూ. 2,000 కోట్లకుపైగా మోసపూరిత లావాదేవీల ద్వారా మ్యూల్ అకౌంట్లలో డబ్బు జమ చేసి, క్రిప్టో వాలెట్లు, ఏటీఎంలు, యూపీఐ ట్రాన్స్ ఫర్ల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది.

Exit mobile version