Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆగస్టు 13న) ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.