Site icon NTV Telugu

HCA: హెచ్ సీఏలో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడి గుర్తింపు.. లక్షల్లో లబ్ధి పొందిన సభ్యులు

Hca

Hca

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోంది. సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హెచ్ సీఏలో లో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడి గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలమైన వారికే పనులు కేటాయించడంతో HCA సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఈడి గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే HCA మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను విచారించింది ఈడీ. రూ. 90 లక్షల రూపాయలు క్విడ్ ప్రో కో జరిగినట్టు గుర్తించారు.

Also Read:Siddaramaiah: సిద్ధరామయ్య కన్నుమూత అంటూ అనువాదం.. మెటా క్షమాపణ

క్రికెట్ బాల్స్ టెండర్ల, జిమ్ సామాను టెండర్లు, స్టేడియం కుర్చీలు టెండర్ లు తమకు కేటాయించినందుకు లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్లుగా వెలుగుచూసింది. మాజీ HCA ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ భార్య పేరు మీద JB jewelers ఖాతా లోకి లంచం డబ్బులు జమ అయినట్లు గుర్తించారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను క్రికెట్ అభివృద్ధి కోసం కాకుండా సొంత పనులకు వాడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. స్టేడియం టెండర్ల నుంచి మొదలుకుని టికెట్ల విక్రయం దాకా అన్నిట్లో గోల్మాల్ కు పాల్పడ్డట్లు గుర్తించారు.

Also Read:Elephant: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి

గత 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి HCA కు 800కోట్లకు పైగా నిధులు వచ్చినట్లు తేలింది. కోట్ల రూపాయలు ఉన్న HCA అకౌంట్ ను సైతం సొంత ప్రయోజనాలకు వాడారని ఆరోపణలు వస్తున్నాయి. 2022 లో జస్టిస్ లావ్ నాగేశ్వర్ రావ్ విచారణలో అనేక విషయాలు బట్టబయలు అయ్యాయి. క్రికెట్ బాల్స్, స్టేడియం చైర్స్, జిమ్ పరికరాలు టెండర్లు లలో కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంపై గతంలోనే HCA సభ్యులను విచారించింది ఈడి.

Also Read:Kothapalli Lo Okappudu Review: కొత్తపల్లిలో ఒకప్పుడు రివ్యూ

HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావ్ సైతం ఇదే రీతిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. HCA లోకి ఎంట్రీ కావడానికి ఎవరెవరికి ఎంత ఇచ్చారో తేల్చనున్నది ఈడి. IPL మ్యాచ్ ల సందర్భంగా టెండర్ల విషయంలోనూ సొంత వాళ్లకే ప్రయోజనాలు చేకూరేలా జగన్ వ్యవహరించినట్లు సమాచారం. ఫుడ్ క్యాటరింగ్, స్టేడియం లో స్టాల్స్, టికెట్స్ కేటాయింపులోనూ తన వారికే కట్టబెట్టుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

Exit mobile version