HCA: హెచ్ సీఏలో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడి గుర్తింపు.. లక్షల్లో లబ్ధి పొందిన సభ్యులు
- హెచ్ సీఏలో లో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడి గుర్తింపు
- 90 లక్షల రూపాయలు క్విడ్ ప్రో కో జరిగినట్టు గుర్తించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోంది. సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హెచ్ సీఏలో లో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడి గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలమైన వారికే పనులు కేటాయించడంతో HCA సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఈడి గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే HCA మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను విచారించింది ఈడీ. రూ. 90 లక్షల రూపాయలు క్విడ్ ప్రో కో జరిగినట్టు గుర్తించారు.
Also Read:Siddaramaiah: సిద్ధరామయ్య కన్నుమూత అంటూ అనువాదం.. మెటా క్షమాపణ
Also Read
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
క్రికెట్ బాల్స్ టెండర్ల, జిమ్ సామాను టెండర్లు, స్టేడియం కుర్చీలు టెండర్ లు తమకు కేటాయించినందుకు లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్లుగా వెలుగుచూసింది. మాజీ HCA ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ భార్య పేరు మీద JB jewelers ఖాతా లోకి లంచం డబ్బులు జమ అయినట్లు గుర్తించారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను క్రికెట్ అభివృద్ధి కోసం కాకుండా సొంత పనులకు వాడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. స్టేడియం టెండర్ల నుంచి మొదలుకుని టికెట్ల విక్రయం దాకా అన్నిట్లో గోల్మాల్ కు పాల్పడ్డట్లు గుర్తించారు.
Also Read:Elephant: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి
గత 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి HCA కు 800కోట్లకు పైగా నిధులు వచ్చినట్లు తేలింది. కోట్ల రూపాయలు ఉన్న HCA అకౌంట్ ను సైతం సొంత ప్రయోజనాలకు వాడారని ఆరోపణలు వస్తున్నాయి. 2022 లో జస్టిస్ లావ్ నాగేశ్వర్ రావ్ విచారణలో అనేక విషయాలు బట్టబయలు అయ్యాయి. క్రికెట్ బాల్స్, స్టేడియం చైర్స్, జిమ్ పరికరాలు టెండర్లు లలో కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంపై గతంలోనే HCA సభ్యులను విచారించింది ఈడి.
Also Read:Kothapalli Lo Okappudu Review: కొత్తపల్లిలో ఒకప్పుడు రివ్యూ
HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావ్ సైతం ఇదే రీతిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. HCA లోకి ఎంట్రీ కావడానికి ఎవరెవరికి ఎంత ఇచ్చారో తేల్చనున్నది ఈడి. IPL మ్యాచ్ ల సందర్భంగా టెండర్ల విషయంలోనూ సొంత వాళ్లకే ప్రయోజనాలు చేకూరేలా జగన్ వ్యవహరించినట్లు సమాచారం. ఫుడ్ క్యాటరింగ్, స్టేడియం లో స్టాల్స్, టికెట్స్ కేటాయింపులోనూ తన వారికే కట్టబెట్టుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
తాజావార్తలు
-
Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
-
Tiffany Trump: తాజ్ మహల్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ బిడ్డ.. భారత్‌లో టిఫనీ సందడి మామూలుగా లేదుగా!
-
IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలే.. ‘కింగ్’ కోహ్లీ మళ్లీ మెరుస్తాడా?
-
Tollywood : టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్లాప్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బిగ్ బ్యానర్?
-
NBK : బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. నందమూరి అభిమానులకు ‘డబుల్ ట్రీట్’..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..