ECI Slams Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇండియన్ బ్లాక్‌కి చెందిన నేతలు ఓటు చోరి అనే పదాన్ని పదే పదే ఉపయోగించడంపై భారత ఎన్నికల కమిషన్ (ECI) గురువారం స్పందించింది. దొంగ ఓటు అనే పదాన్ని చెత్త పదంగా అభివర్ణించింది. ఇది కోట్లాది మంది భారతీయ ఓటర్లపై ప్రత్యక్ష దాడిగా, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది సమగ్రతపై దాడిగా ఎన్నికల సంఘం అభివర్ణించింది.