Site icon NTV Telugu

EC: ఏపీ సహా ఐదు రాష్ట్రాల అధికారులపై వేటు

E

E

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల తీరును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల అధికారుల తీరుపై ఈసీ కొరడా ఝుళిపించింది. తాజాగా మంగళవారం ఐదు రాష్ట్రాలకు చెందిన అధికారులపై వేటు వేసింది. ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అధికారులను బదిలీ చేసింది. అస్సాం, బీహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 8 మంది జిల్లా మేజిస్ట్రేట్ (DM), 12 మంది పోలీసు సూపరింటెండెంట్ (SP)లను బదిలీ చేసింది.

 

ఏపీలో బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు:
ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి
పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి.
గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు
చిత్తూరు జిల్లా ఎస్పీ జాఘవా
అనంతపురం జిల్లా ఎస్పీ అన్భురాజన్
నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి.

బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు:
అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి
కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు
తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషాపై బదిలీ వేటు పడింది.

సాయంత్రం ఐదు గంటల్లోగా బదిలీ కావాలని ఈసీ పేర్కొంది. అంతేకాకుండా.. తమ కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్న ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆదేశించారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. సెకండ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అటు తర్వాత మే 7, 13, 20, 25, జూన్ 1న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. మరోవైపు ఎన్నికలు సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచారంలో నేతలు దూసుకుపోతున్నారు. అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నాయి.

 

Exit mobile version