NTV Telugu Site icon

EC Notices Pawan: పవన్ కళ్యాణ్కు ఈసీ నోటీసులు

Ec

Ec

EC Notices Janasena Chief: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి స్కాం స్టార్, లాండ్ గ్రాబర్, సాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఈ కామెంట్స్ పై ఈ నెల 8వ తేదీన ఎలక్షన్ కమిషన్ కు విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారని ఈ సందర్భంగా ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేయగా.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.

Read Also: TDP vs BJP: ఎమ్మెల్యే అభ్యర్థి మెడలో నుంచి కండువా తీసేసిన మాజీ ఎమ్మెల్యే

కాగా, అంతుకు ముందు ఏపీ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ సీట్లు దక్కించుకొని ప్రభుత్వంలో భాగం కావాలని జనసేన పార్టీ చూస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీతో కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ తను పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో పాటు మరో 20 ఎమ్మెల్యే సీట్ల నుంచి అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపారు. కొన్ని ఎంపీ సీట్లు నుంచి కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే జనసేన తరఫున స్టార్ క్యాంపైనర్లుగా ఎవరు ప్రచారం చేస్తారనే విషయం మీద ఈ రోజు అధికారికంగా జనసేన పార్టీ ప్రకటన చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెనర్లగా పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీ- టీవీ నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, జబర్దస్త్ హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెనర్లుగా వ్యవహరిస్తారని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ పేరుతో ఒక లేఖ విడుదల చేసింది.