Gnanavel Raja: వేట్టయన్ గురించి అనలేదు.. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: కంగువా నిర్మాత
- నవంబర్ 14న కంగువా
- నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు
- వేట్టయన్ గురించి మాట్లాడలేదని క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించారు. కంగువా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. అయితే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు నెట్టింట విమర్శలకు దారితీశాయి. తాజాగా వీటిపై ఆయన వివరణ ఇచ్చారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, వేట్టయన్ గురించి మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు.
కంగువాలోని నటీనటుల వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచారని జ్ఞానవేల్ రాజాను ఓ అభిమాని ప్రశ్నించాడు. ‘ఇటీవల ఓ పెద్ద చిత్రం నటీనటుల వివరాలను ఆ సినిమా ప్రకటించిన రోజే పంచుకుంది. అలా చేయడం వల్ల ఆ చిత్రానికి పెద్దగా ప్రయోజనం కలగలేదు. కనీసం ఓపెనింగ్స్‌కు కూడా ఉపయోగపడలేదు. అందుకే కంగువాలోని నటీనటుల గురించి వివరాలు షేర్ చేయలేదు’ అని జ్ఞానవేల్ బదులిచ్చారు. రజనీకాంత్ ‘వేట్టయన్’ సినిమా గురించే జ్ఞానవేల్ పరోక్షంగా మాట్లాడారని చాలామంది అందుకున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై విమ్మర్శలు వచ్చాయి.
Also Read
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
- RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలపై జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇచ్చారు. ‘నేను చెప్పిన పెద్ద సినిమా ఖేల్ ఖేల్ మే. ఈ సినిమాలోని నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ ముందే పంచుకుంది. ఎంతో మంది అగ్ర నటీనటులు ఉన్నప్పటికీ.. ఆ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇదే మాట చెప్పాను. నేను ఏ సినిమా గురించి చెప్పానని అప్పుడు ఎవరూ అడగలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకున్నారు. ఇక వదిలేయండి’ అని రాజా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?