Korukonda Crime: కిలాడి లేడీ.. ఇన్సూరెన్స్ కోసం క్రైమ్ డ్రామా, చివరలో ట్విస్ట్!
- బంగారం దొంగతనం జరిగిందని కట్టు కథ
- పోలీసులను మోసం చేయాలని ప్రయత్నించిన కిలాడి లేడీ
- ఇన్సూరెన్స్ కోసం క్రైమ్ డ్రామా, చివరలో ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఓ మహిళ వేసిన ప్లాన్ చివరకు ఆమెనే ఉచ్చులో పడేసింది. బంగారం దొంగతనం జరిగిందని కట్టు కథ అల్లుతూ పోలీసులను మోసం చేయాలని ప్రయత్నించిన ‘కిలాడి లేడీ’.. చివరకు విచారణలో దొరికిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై రాజమండ్రి నార్త్ డీఎస్పీ సుభాష్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
కోరుకొండలో ఒంటరిగా నివాసం ఉంటున్న ముండ్రు పద్మ (56) తాను కొనుగోలు చేసిన 200 గ్రాముల బంగారానికి ముందుగానే ఇన్సూరెన్స్ చేయించింది. ఆ తర్వాత ఇదే బంగారం దొంగతనానికి గురైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానాలు తలెత్తాయి. బాధితురాలు చెప్పిన వివరాలు, ఇక్కడి ఆధారాలు ఒక్కటిగా సరిపోకపోవడంతో కేసు మలుపు తిరిగింది. దీంతో పోలీసులు ఆమెను లోతుగా విచారించగా.. అసలు నాటకం బయటపడింది.
Also Read
- Kulgam: కుల్గామ్‌లో పహల్గామ్ సీన్ రిపీట్.. హిందువులు లక్ష్యంగా ఉగ్ర దాడి!
- Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
- IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్‌తో తలపడనున్న ఇండియా..
- Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
Also Read: TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి.. డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ!
ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందేందుకు తానే కథ సృష్టించి.. దొంగతనం జరిగినట్టు చిత్రీకరించానని ముండ్రు పద్మ ఒప్పేసుకుంది. కోరుకొండ నార్త్ డీఎస్పీ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పిల్లలు ఉద్యోగం రీత్యా లండన్‌లో ఉండడంతో.. పద్మ ఒంటరిగా నివాసం ఉంటుంది. పద్మపై గతంలో ఇంట్లో పని చేసే మహిళలపై దాడి చేసినట్లుగా కేసులు ఉన్నట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Kulgam: కుల్గామ్‌లో పహల్గామ్ సీన్ రిపీట్.. హిందువులు లక్ష్యంగా ఉగ్ర దాడి!
-
Anupama: బ్యాడ్ డేస్ ని అసలు మాటల్లో చెప్పలేను!
-
Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
-
JNTU Hyderabad : JNTUHలో పదవుల పోరు.. బలి అవుతున్న విద్యార్థుల భవిష్యత్తు?
-
IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్‌తో తలపడనున్న ఇండియా..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!