Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండల పరిధిలో వడిశలేరు-రంగంపేట మధ్య మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణ పనులు ముగించుకుని స్వగ్రామాలకు తిరిగి వస్తున్న కార్మికులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం పిఠాపురం మండలంలోని మల్లాం, జల్లూరు గ్రామాలకు చెందిన 11 మంది కార్మికులు బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతానికి నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లారు. రెడీమిక్స్ వాల్స్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని మిగిలిన సామగ్రితో కలిసి స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో వాహనం టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనం రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సామర్లకోటకు చెందిన మసకపల్లి బాబు, మురమర్ల రాజు, కాకడ రాజు అనే ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఎనిమిది మంది స్వల్ప గాయాలతో బయటపడగా.. వారిని 108 అంబులెన్స్‌ల సాయంతో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో అరగంటలో తమ గమ్యస్థానాలకు చేరుకునే సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. సమాచారం అందుకున్న రంగంపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మృతుల స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!