తిరుమలలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడు అంటే భయం వుంది కాబట్టి అవినీతి పరులు సంపాదించిన కోట్ల రూపాయలు హుండీలో సమర్పిస్తున్నారన్నారు డిప్యూటి సియం నారాయణస్వామి.
హుండీలో భక్తులు వేసిన డబ్బుతో టీటీడీ పేదవారి విద్యకు,ఆరోగ్యానికి వినియోగిస్తుందన్నారు. చంద్రబాబు మ్యానిఫెస్టో ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుది పిచ్చి పార్టీ ఆయనతో వున్నవారందరిది రాక్షస మనస్తత్వం. జగన్ననే మా నమ్మకం అని 90 శాతం మంది ప్రజలు చెప్పకపోతే నేను రాజకీయం వదిలేస్తాను అని సవాల్ విసిరారు.
Read Also:Covid-19: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..?
YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. జగనన్న మా భవిష్యత్ స్టిక్కర్లతో టీడీపీ. నాయకులు గుండెల్లో గునపాలు దిగుతున్నాయి అన్నారు. టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగిన చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీ దిగడంతోనే వైఫల్యం ఒప్పుకున్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క టిడ్కో ఇల్లయినా కట్టగలిగారా….? అని ఆమె ప్రశ్నించారు.
Read Also: IPL 2023: అజింక్య రహానేపై ఎంఎస్ ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్