Shubman Gill Lead India A in Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 గురువారం (సెప్టెంబర్ 5) నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో నాలుగు జట్లు తలపడుతుండగా.. ఓ టీమ్ మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఇండియా-ఎ vs ఇండియా-బి మధ్య రేపు ఉదయం 9 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఇండియా-సి vs ఇండియా-డి మధ్య గురువారం ఉదయం మ్యాచ్ మొదలవుతుంది. అయితే అందరి దృష్టి ఎ vs బి మధ్యనే ఉంది. ఎందుకంటే ఎలో భారత టెస్ట్ టీమ్ రెగ్యులర్‌లు ప్లేయర్స్ ఉన్నారు. అందులో ఎవరికి చోటుదక్కుతుందో చూడాలి.
ఇండియా-ఎ జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా ఆడనున్నాడు. అతని భాగస్వామి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. గిల్ సహా కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నా.. ఈ ఇద్దరు మూడు, స్థానాల్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. భారత జట్టులో వేరు ఈ స్థానాల్లోనే ఆడుతున్నారు. రంజీ ట్రోఫీలో సత్తాచాటిన 23 ఏళ్ల శాశ్వత్ రావత్ మరో ఓపెనర్‌గా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధృవ్ జురెల్ కీపర్‌గా ఆడనున్నాడు.
మిడిల్ ఆర్డర్‌లో ముగ్గురు పోటీపడుతున్నారు. తిలక్ వర్మ, రియాన్ పరాగ్, శివమ్ దూబేలలో ఒకరికే అవకాశం ఉంది. అత్యుత్తమ ఫస్ట్-క్లాస్ రికార్డు ఉన్న తిలక్‌కు చోటు దక్కనుంది. స్పిన్ కోటాలో కుల్దీప్ యాదవ్ సహా తనుష్ కోటియన్ ఆడనున్నాడు. ఒకవేళ పరాగ్‌ను రెండవ స్పిన్నర్‌గా తీసుకుంటే.. కోటియన్ బెంచ్‌కే పరిమితం అవుతాడు. పేస్ కోటాలో ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ సహా విద్వాత్ కవేరప్ప రేసులో ఉన్నారు. ఖలీల్, కవేరప్పలకు నిరాశ తప్పకపోవచ్చు.
Also Read: BAN vs PAK: రిక్షా పుల్లర్‌కు నా అవార్డు అంకితం: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్
ఇండియా-ఎ తుది జట్టు:
మయాంక్ అగర్వాల్, శాశ్వత్ రావత్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ (కీపర్), తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.