ఏలూరు జిల్లా కైకలూరు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా కలిదిండి మండలంలో లోడిద లంక, పలాటపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రచారానికి వెళ్తుంటే డీఎన్ఆర్ అన్న ఎన్నికలకు 13 రోజులే ఉంది.. నీవు మా దగ్గరికి రావాలా అన్న అని ప్రజలు అంటున్నారని చెప్పుకొచ్చారు. జగనన్న సంక్షేమా పథకాలు ప్రజల్ని ఎంత దగ్గర చేస్తున్నాయో అర్థమవుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైకలూరులో మంచి మెజార్టీతో గెలుస్తుందన్నారు. ఇక, ప్రతిపక్షం వారు మూకుమ్మడిగా నాపై అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక ఆడపిల్లని అడ్డుపెట్టుకుని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Rohit Sharma Birthday: రో.. ఈ ఏడాది నీ కలలు నిజమవుతాయి: రితికా సజ్దే
కాగా, నాపై అసత్య వీడియో చిత్రీకరించి వాట్సాప్ లో సోషల్ మీడియాలో అలజడి చేస్తున్నారని కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ కి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు విచారిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు కామినేని శ్రీను పోలీస్ స్టేషన్ కి వెళ్లి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నా మీద కావాలనే ప్రతిపక్ష నాయకుడు బురద జలటమే కాకుండా అసత్య ప్రచారం చేసిన వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి చౌక బార్లు పనులు మానుకొని ఎలక్షన్ లో నా మీద గెలిచి చూపించాలి తప్ప.. గెలవనేని వారు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు.
Read Also: Aroori Ramesh: పిచ్చిగా మాట్లాడితే దళిత వర్గాలు ఊరుకోరు.. కడియంపై ఆరూరి కీలక వ్యాఖ్యలు
ఇక, సోషల్ మీడియాలో నా మీద తప్పుడు ప్రచారం చేసే వారి మీద కేసు పెడితే దూలం నాగేశ్వరరావు బీసీల మీద కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ ప్రతిపక్ష నాయకుడు కామినేని శ్రీను ప్రచారం చేయటం దారుణమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావు అన్నారు. అన్ని పార్టీలు జతకట్టిన మా జగనన్న సింగల్ గా వస్తాడని అలాగే, కైకలూరు నియోజకవర్గంలో నేను కూడా సింగిల్ గానే వస్తానని మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎవరి బలం ఏంటో తేలిపోతుందని దూలం నాగేశ్వరావు తెలిపారు. ప్రజా ఆశీర్వాద యాత్ర చూస్తుంటే పడటపాలెంలో వంద మంది టీడీపీ, జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన యువకులకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.