హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు. 69,100 కోట్లతో నగరం నలుదిశలా మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. మూడో దశలో 278 కిలోమీటర్ల పొడవున కొత్తగా మరో 8 మార్గాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో నాలుగు మార్గాల్లో మెట్రో రైల్ నిర్మించాలని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Raasi Khanna: నేను బరువు తగ్గడానికి అతడే కారణం.. ?
ఇక దీనిపై మెట్రో ఎండీ NVS రెడ్డి మాట్లాడుతూ.. ఓల్డ్ సిటీలో కొన్ని కారణాలతో మెట్రో నిర్మాణం మరింత ఆలస్యం అవుతుంది అని వెల్లడించారు. రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది.. అలాగే BHEL నుంచి లక్డికపుల్ వరకు మొత్తం 26 కిలోమీటర్లతో పాటు నాగోల్ తో ఎల్బీనగర్ మధ్య 5 కి.మీటర్లు.. జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తాము అని ఆయన తెలిపాడు.
Read Also: Minister Kottu Satyanarayana: పవన్ కళ్యాణ్ చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకుపోయారు..
ఇక, ఫేస్ 3ఏలో 142 కిలోమీటర్లలో 68 స్టేషన్స్ ఉంటాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ టూ ఇస్నాపూర్ మధ్య 13 కిలో మీటర్లు.. ఎల్బీనగర్ టూ పెద్ద అంబర్ పేట మధ్య 13కిలో మీటర్లు.. శంషాబాద్ నుంచి షాద్ నగర్ వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర.. అలాగే శంషాబాద్ నుంచి కందుకూరు వరకు 26 కిలో మీటర్ల వరకు.. తార్నాక నుంచి ఈసీఐఎల్ మధ్య 8కిలోమీటర్లు.. ఐబీఎస్ నుంచి తుంకుంటా వరకు 17 కిలోమీటర్లు.. ప్యారాడైస్ టూ కండ్లకోయ వరకు 12 కిలోమీటర్ల నిర్మాణం జరుగునుందని మెట్రో ఎండీ వెల్లడించారు.
Read Also: Facebook Fraud: కొంపముంచిన ఫేస్బుక్ చాటింగ్.. మొత్తం దోచేసిన కి’లేడీ’
మరో వైపు.. ఫేజ్ 3బీలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు మెట్రో కోసం 158 కిలో మీటర్లలో మొత్తంలో 156కిలో మీటర్ల మార్గంలో మెట్రో రైల్ నిర్మాణం చేపడుతాము అని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ కారిడార్ లో 1.5 కిలోమీటర్స్ లో అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా మెట్రో రైలు రానుంది అని ఆయన పేర్కొన్నారు. జేబీఎస్ టూ తుముకుంటా.. అండ్ పారాడైస్ టు కండ్లకోయా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ అండ్ మెట్రో రైలు రానున్నాయి అని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.
Read Also: Naveen Vijaya Krishna: విజయ నిర్మల పెద్ద మనవడు.. నరేష్ కొడుకు ఏంటి ఇలా మారిపోయాడు..?
ఓఆర్ఆర్ పఠాన్ చేరు, కొకాపెట్ నుండి నార్శింగి వరకు 22 కిలోమీటర్లలో 3 స్టేషన్ లు ఉంటాయి అని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే కంటోన్మెంట్ పరిధిలో జీహెచ్ఎంసీలో కలిస్తే భూసేకరణకు కేంద్రం నుంచి అనుమతులు అవసరం లేదు.. ఇప్పటి వరకు మాత్రం ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది.. పాత బస్తీలో మెట్రోను 99శాతం ఎల్అండ్ టీ నిర్మిస్తుంది. డిటేయిల్ డీపీఆర్ ను త్వరలోనే తయారు చేస్తాము అని ఆయన అన్నారు. ప్రస్తుతం మెట్రోలో ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు.. ఈ సంవత్సరం
చివరి వరకు ఇది ఏడు లక్షలకు చేరుకుంటుంది అని మెట్రో ఎండీ ధీమా వ్యక్తం చేశారు.