ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన “డ్యూడ్” సినిమా బాక్సాఫీస్ హిట్ అయ్యి. దీపావళి కానుకగా తమిళ, భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మంచి స్పందన తెచ్చుకుంటోంది. అయితే ఈ సినిమాపై ఓ ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన విమర్శలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. కథ అర్థవంతంగా లేదని, సన్నివేశాలకు కనెక్షన్ లేదని, “చెత్త రీల్స్ కలిపినట్టుంది” అని కామెంట్ చేశారు. అలాగే మమిత మోకాళ్లపై కూర్చునే సీన్‌ను సాధారణం అన్నట్లు దర్శకుడు ఇంటర్వ్యూలో మాట్లాడడాన్ని కూడా తప్పుపట్టారు..
Also Read : Akhanda 2 : భారీ అంచనాల నడుమ ‘అఖండ 2’ ప్రీమియర్స్ ప్లాన్..
‘‘మీ ఇంటర్వ్యూలు చూసాను. హీరోయిన్ మమిత మోకాళ్లపై కూర్చుని ప్రేమ వ్యక్తం చేసే సన్నివేశం చాలా కామన్ అన్నట్లుగా చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. నిజమైన స్నేహితులెప్పుడూ అలా మాట్లాడుకోరు. మీరు చెప్పినట్లు కూడా అదేమంతా మామూలు విషయం కాదు. ఇలాంటి సిగ్గుచేటు పని స్నేహితుల మధ్య సాధారణ మన్నట్లు మీరు చెప్పడం బాలేదు. సినిమా కూడా అర్థవంతంగా లేదు. సీన్ సీన్ కి ఎలాంటి పొంతన లేకుండా చెత్త రీల్స్ అన్నింటినీ ఒకచోట చేర్చినట్లుగా అనిపించింది. ఇక నుంచైనా కాస్త మంచి సినిమాలు తీయండి’ అని సలహా ఇచ్చారు. దీనికి కీర్తిశ్వరన్ స్పందిస్తూ…
‘నాకు నేరుగా మెస్సేజ్ చేసే బదులు నీ బతుకేదో నువ్వు బతకొచ్చు కదా’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు’’ ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు దర్శకుడిపై ఫైర్ అవుతున్నారు. కొత్త దర్శకుడు విమర్శలు కూడా తీసుకోలేకపోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా చాట్ స్క్రీన్‌షాట్ షేర్ చేస్తూ తాను ప్రేక్షకుడిగా జన్యూన్ ఫీడ్ బ్యాక్ ఇచ్చానని, కానీ దర్శకుడు ఎగతాళి చేశారని చెప్పాడు. ఇప్పుడు ఈ వివాదంపై ప్రదీప్ రంగనాథన్ స్పందిస్తారేమో అనేది చర్చగా మారింది.