Site icon NTV Telugu

Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్‌బాబుపై కేసు కొట్టివేత.. “ఇది రైతుల విజయం, ప్రజల గెలుపు”

Sridhar Babu

Sridhar Babu

Duddilla Sridhar Babu : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎదుర్కొన్న కేసును హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో కొట్టేసింది. ఈ కేసు 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదు అయింది. కోర్టు తాజా తీర్పుతో న్యాయం జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, “2017లో BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతుల భూములు బలవంతంగా లాక్కొంటుందని నిరసనగా పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లాం. అప్పట్లో మేము 12మందిపై అక్రమంగా నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిప్పుతూ మాకు మానసిక వేధింపులు ఇచ్చారు. కానీ చివరకు న్యాయమే గెలిచింది” అన్నారు.

Viral : తాత రాక్.. మనవడు షాక్..! నెటిజన్లను మెస్మరైజ్ చేసిన తాతయ్య

ఈ తీర్పుతో రాజ్యాంగ వ్యవస్థలపై, న్యాయవ్యవస్థపై మా నమ్మకం మరింత బలపడిందని, ఇది కేవలం మా వ్యక్తిగత విజయం కాదు.. ఇది రైతుల గెలుపు, ప్రజాస్వామ్యానికి న్యాయం చేసిన రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. మా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బాధిత రైతులకు ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని, అందరికీ న్యాయం జరగే పాలన నడుస్తోందన్నారు. గతంలో న్యాయవాదులపై జరిగిన హత్యకాండలో అసలు నిందితులను వదిలేసి మాపై కేసులు పెట్టారని, అలాంటి దుర్మార్గాలు ఇక జరగవన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నానని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

Single : కేతిక కల నెరవేర్చిన శ్రీ విష్ణు

Exit mobile version