Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్‌బాబుపై కేసు కొట్టివేత.. “ఇది రైతుల విజయం, ప్రజల గెలుపు”
- HYD: మంత్రి శ్రీధర్‌బాబుపై నమోదైన కేసు కొట్టివేత
- కాళేశ్వరం భూ సేకరణ అంశంలో కేసు కొట్టేసిన నాంపల్లి కోర్టు
- ఇది రైతుల విజయం, ప్రజల గెలుపు : శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎదుర్కొన్న కేసును హైదరాబాద్ నాంపల్లి కోర్టులో కొట్టేసింది. ఈ కేసు 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదు అయింది. కోర్టు తాజా తీర్పుతో న్యాయం జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, “2017లో BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతుల భూములు బలవంతంగా లాక్కొంటుందని నిరసనగా పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లాం. అప్పట్లో మేము 12మందిపై అక్రమంగా నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిప్పుతూ మాకు మానసిక వేధింపులు ఇచ్చారు. కానీ చివరకు న్యాయమే గెలిచింది” అన్నారు.
Viral : తాత రాక్.. మనవడు షాక్..! నెటిజన్లను మెస్మరైజ్ చేసిన తాతయ్య
Also Read
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
ఈ తీర్పుతో రాజ్యాంగ వ్యవస్థలపై, న్యాయవ్యవస్థపై మా నమ్మకం మరింత బలపడిందని, ఇది కేవలం మా వ్యక్తిగత విజయం కాదు.. ఇది రైతుల గెలుపు, ప్రజాస్వామ్యానికి న్యాయం చేసిన రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. మా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బాధిత రైతులకు ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని, అందరికీ న్యాయం జరగే పాలన నడుస్తోందన్నారు. గతంలో న్యాయవాదులపై జరిగిన హత్యకాండలో అసలు నిందితులను వదిలేసి మాపై కేసులు పెట్టారని, అలాంటి దుర్మార్గాలు ఇక జరగవన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నానని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!