Duddilla Sridhar Babu : రైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని, ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో కొంత పంట నష్టం జరిగితే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిఆర్ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉన్న పది సంవత్సరాలపాటు రైతుల ను పట్టించుకోని కేసీఆర్ ఎంపీ సీట్ల కోసం దొంగ కన్నీరు కారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, టేలండ్ ప్రాంత రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు తమ ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారన్నారు శ్రీధర్ బాబు. కాలేశ్వరం ప్రాజెక్టుతో మంథని ప్రాంతానికి చుక్క నీరు కూడా రాలేదని, మూడు పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్టు ఉనికికి ప్రమాదం ఏర్పడిందని ఈ పాపం గత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారన్నారు.
అంతేకాకుండా.’రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు గత ప్రభుత్వం ఫిబ్రవరి, మార్చ్ మాసాల్లో వినియోగించిన కరెంట్ కంటే ఎనిమిది శాతం అధికంగా కరెంటు కొనుగోలు చేసి మరీ సరఫరా చేస్తున్నాం.. రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరతలు లేవని, ప్రతిపక్షాలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి జీరో బిల్లు అందిస్తున్నాం. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న వినియోగదారులు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు., ప్రకృతి వైపరీత్యం వల్ల కొంత పంట నష్టం జరిగిందని, నిజంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది..
Also Read
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తమ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుంది.. ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఇప్పటికే 35 కోట్ల ఫ్రీ టికెట్లు జారీ చేశాం… 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నాం.. ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచాం.. పెద్దపెల్లి జిల్లాలో 15 కోట్ల రూపాయల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకున్నారు… ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ఆరు గ్యారెంటీలో ప్రతి పథకానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తాం.. ఐదు సంవత్సరాలలోపు ప్రతిపాక రిజర్వాయర్ను పూర్తి చేస్తాం. ఫోన్ టాపింగ్ అతిపెద్ద నేరమని, చట్టానికి ఎవరూ అతీతులు కారని తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు.. మేము ఆరోపిస్తే కాంగ్రెస్ ఆరోపిస్తుందని గగ్గోలు పెడతారని, కానీ బారాస పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య లిక్కర్ స్కాం ఫోన్ టాపింగ్ ఇతర అవినీతి ఆరోపణలపై ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నామని పోటీ నుండి తప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు..’ అని దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!