Site icon NTV Telugu

Dubbing Movies : డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతికి ఇబ్బందులు తప్పేలా లేవు

Tollywood

Tollywood

సంక్రాంతి సీజన్ అంటే ఎప్పటిలాగే థియేటర్లపై మొదటి హక్కు తెలుగు సినిమాలదే. ఈసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో ముందుగానే జనవరి 9న బరిలోకి దిగుతున్నాడు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు సినిమాతో రంగంలోకి వస్తున్నాడు. వీటితో పాటు మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకొస్తున్నారు. థియేటర్లలో మెజారిటీ షోస్ ముందుగా తెలుగు సినిమాలకే కేటాయిస్తారు.

Also Read : Kalam kaval : రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘మమ్ముట్టి’ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కాలంకవాల్

ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే దళపతి విజయ్ చివరి సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న జననాయగన్ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా కూడా జనవరి 9న రిలీజ్ కానుంది కాని సంక్రాంతి సీజన్‌లో తెలుగు సినిమాలే థియేటర్లను ఆక్రమిస్తే, హైదరాబాద్‌లో కొన్ని మెయిన్ థియేటర్లు తప్ప బిజీ సెంటర్లలో ఈ సినిమాకు స్క్రీన్స్ దొరకడం కష్టమేనన్నది ట్రేడ్ టాక్. గతంలోనూ ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురైనప్పుడు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్న ఉదాహరణలూ ఉన్నాయి. ఇదే పరిస్థితి శివకార్తికేయన్, శ్రీలీల కాంబినేషన్ లో సుధా కొంగర తెరకెక్కిస్తున్న పరాశక్తి సినిమాకూ ఎదురయ్యింది. కంటెంట్ బలంగా ఉన్నా, సంక్రాంతి సమయంలో థియేటర్స్ ఇవ్వడంలో డబ్బింగ్ సినిమాలకు ఎప్పుడూ చివరి ప్రాధాన్యమే. డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుగా తెలుగు సినిమాలకు థియేటర్లు ఇచ్చి, మిగిలితేనే డబ్బింగ్ సినిమాలపై దృష్టి పెడతారు. దీంతో ఈసారి కూడా డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతి ఇబ్బందులు తప్పేలా లేవన్నది ఇండస్ట్రీ టాక్. సంక్రాంతి బరిలో ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు అనే చర్చ ఆసక్తిగా మారింది.

Exit mobile version