NTV Telugu Site icon

Dubba Rajanna Swamy: నేటి నుండి దుబ్బ రాజన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Dubba Rajanna Swamy Brahmotsavam

Dubba Rajanna Swamy Brahmotsavam

Dubba Rajanna Swamy: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో వెలిసిన దుబ్బ రాజన్న స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా 2.50లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాల షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 24న సాయంత్రం స్వస్తి పుణ్య వాచనంతో అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. ఫిబ్రవరి 25న రాత్రి భక్తుల సమక్షంలో స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించబడుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న భక్తులు జాగరణ చేస్తారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవం జరగనుండగా, అనంతరం రుద్రాభిషేకం, నిషిపూజలు నిర్వహించనున్నారు.

Read also: Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లోకి భారీగా యువకుల చేరిక..

బ్రహ్మోత్సవాల చివరి రోజు ఫిబ్రవరి 28న స్వామి వారి రథోత్సవం ఘనంగా జరపనున్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. స్వామి వారి దివ్య దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరవుతున్నారు. ఈ పవిత్ర బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ భాగస్వామ్యం అవ్వాలని ఆలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Read also: Virat Kohli Record: ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు!