Site icon NTV Telugu

Woman Kills Husband: దారుణం.. బండరాయితో తలపై కొట్టి భర్తను హత్య చేసిన భార్య..

Murder

Murder

భర్తలను భార్యలు మట్టుబెడుతున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ ప్రరిడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై మోది భర్తను హత్య చేసింది భార్య. భర్త మద్యానికి బానిసై తరచూ తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది. భర్త వేధింపులు భరించలేక బండ బండరాయితో మోది హత్య చేసింది. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వట్టేపల్లిలోని సైఫీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూలి పని చేసుకునే షేక్ మహ్మద్ మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం సేవించి వచ్చి భార్యను వేధిస్తున్నాడు. ఇది భరించలేని భార్య బండరాయితో మోది భర్తను హత్య చేసింది. ఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

READ MORE: Air India Crash: ఇంజన్ “ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌” తప్పిదమే ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణమా.?

Exit mobile version