మనం తెలుగు రాష్ట్రాల్లో మునగ సాగు అధికంగా పండిస్తున్నారు.. మిగిలిన కూరగాయల పంటలతో నష్టాలను చవిచూసిన రైతులు ఇప్పుడు మునగ బాట పట్టారు.. మునగ సాగుతో ఎక్కువ లాభాలను కూడా పొందుతున్నారు.. ఒక ఎకర విస్తీర్ణంలో 500 మొక్కలను పెంచుతున్నారు. దీనికి 35000 వేలు పెట్టుబడి ఆవుతోంది. ఒక్కో మునగ మొక్క నుంచి 600 నుంచి 800 రూపాయల వరకు ఆదాయం వస్తుందని, మార్చి ఏప్రెల్, మే నెలలో దిగుబడులు వస్తాయాని ఈ సీజన్ లో ఒక్కో మునగకాయ ధర రూపాయి నుండి రూపాయిన్నర వరకు పలకడంతో మంచి ఆదాయం సమకూరింది..
ఈ పంటలో చివరగా కాసిన కాయలకు మరింత డిమాండ్ పలకడంతో ఒక్కో కాయ ధర మూడు రూపాయల వరకు ఉంటుందని దీంతో ఒక్క ఎకరాకు సుమారు లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు.. వర్షాలు పడుతున్న వేళ తోటలకు తెగులు సోకుతున్నాయని రైతులు అంటున్నారు..ఇది వచ్చిన చెట్టులో కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్ళిపోయి నేలకు వాలిపోతుంది. వేర్లు కూడా కుళ్ళిపోవటం తో చెట్టు మరణిస్తుంది. ప్రతిచెట్టు మొదట్లో ట్రైకోడెర్మా విరిడి రెండు కిలోలు, 90 కిలోల పశువుల ఎరువు కలిపి మిశ్రమాన్ని ఐదు కిలోలు చొప్పున వేయాలి.. ఇది పూత దశ నుంచి పిందె దశ వరకు ఉంటుందని చెబుతున్నారు..
ఈ తెగులు వల్ల లోపల పదార్థాన్ని తిని కాయను నాశనం చేస్తోంది. దీంతో కాయలు వంకర్లు తిరుగుతాయి దీని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలి. రైతులు గుర్తు పెట్టుకోవాలసింది ఏమిటంటే ఏపంటకైనా రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆధిక లాభాలను, దిగుబడులను పోందవచ్చు.. అంతేకాదు ఒకే పంటను కాకుండా పంటను మారిస్తే మంచి దిగుబడిని పొందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు..