సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ (బాబు) వ్యవహారంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. శ్రీతేజకు అన్ని విధాలా అండగా ఉంటామని, పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే ఆయన మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయల డబ్బులు డిపాజిట్ చేయడం జరిగింది. దీనిపై వచ్చే వడ్డీ డబ్బులను ప్రతినెల శ్రీతేజ తండ్రికి అందేలా ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ఖర్చుల కింద దాదాపు 70 లక్షల రూపాయలు చెల్లించారు. ప్రస్తుతం శ్రీతేజకు అవసరమైన రిహాబిలిటేషన్ కేంద్రంలో అయ్యే ఖర్చును కూడా అల్లు అర్జున్ భరిస్తున్నారు అని అన్నారు. ఇక శ్రీతేజ తండ్రి మాట్లాడుతూ, “ఇప్పటివరకు అన్ని విధాలుగా అల్లు టీం మమ్మల్ని ఆదుకుంది. వారు చాలావరకు బాగా రెస్పాండ్ అయ్యారు” అని కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : Pushpa 2 Stampede Tragedy: : కోలుకోని శ్రీతేజ, సహాయం కోసం తండ్రి ఎదురుచూపు!
అందించిన చికిత్స, సహాయం వల్ల శ్రీతేజ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే బాగా కుదుటపడుతోంది అని ఆయన వెల్లడించారు. ఇంత సహాయం అందినా, శ్రీతేజకు పూర్తిస్థాయి రికవరీ కోసం మరికొంత ఆర్థిక సహాయం అవసరం ఉందని శ్రీతేజ తండ్రి దిల్ రాజు దృష్టికి తీసుకువచ్చారు. “అన్ని విషయాలు దిల్ రాజు గారితో మాట్లాడడం జరిగింది,” అని ఆయన తెలిపారు. దీనికి స్పందించిన దిల్ రాజు కూడా, అన్ని విధాలా సహాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దిల్ రాజు, అల్లు అర్జున్ టీం అందిస్తున్న తోడ్పాటుతో శ్రీతేజ త్వరగా కోలుకుంటారని ఆశిద్దాం.