NTV Telugu Site icon

Ganja Smuggling: ఓయో రూంలో గంజాయి దుకాణం పెట్టిన కేటుగాళ్లు

Oyo

Oyo

Ganja Smuggling: హైదరాబాద్ కొండాపూర్ లోని ఓయో రూమ్ లో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని కావలికు చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన సంజనగా గుర్తించారు పొలిసు అధికారులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరు గత కొంతకాలంగా ఆరుకు ప్రాంతాల నుండి గంజాయి తీసుకువచ్చి, ఓయో రూమ్ లో ఉంటూ విక్రయాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు, వారి వద్ద నుండి 3.625 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Minister Seethakka: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై అనవసర రాజకీయాలు చేయొద్దు

పోలీసులు గంజాయి సరఫరా చేస్తున్న వారిపై NDPS (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యాపారం వెనుక ఉన్న ముఠా సభ్యుల వివరాలను వెలికి తీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. గంజాయి సరఫరా వంటి నేరాలను తీవ్రంగా నిరోధించేందుకు ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని, పౌరులు నేరాలకు సంబంధించిన సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గంజాయి వ్యాపారానికి సంబంధించి పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.