Drug Peddling Gang Arrested: మత్తు పదార్థాలకు అడ్డాగా హైదరాబాద్.. భారీగా గంజాయి పట్టివేత
- మత్తు పదార్థాలకు అడ్డాగా హైదరాబాద్..
- భారీగా గంజాయి పట్టివేత
- వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug Peddling Gang Arrested: హైదరాబాద్ నగరం రోజురోజుకి మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందా అని అనిపిస్తోంది. గత కొద్దిరోజుల నుంచి నగర పోలీసులు, ఎస్టిఎఫ్ పోలీసులు దాడుల నేపథ్యంలో పబ్బులు, ప్రవేట్ పార్టీలలో పెద్ద సంఖ్యలో ఈ మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. మరోవైపు కొందరు గంజాయి విక్రయించే గ్యాంగులు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. ఎవరికైనా గంజాయి, డ్రగ్స్ కావాలంటే కేవలం ఫోన్ చేస్తే చాలు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి డెలివరీ చేసేలా సేవలు అందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి హైదరాబాద్ మహానగరంలో మత్తు పదార్థాలు దొరికాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Akkineni : గ్రాండ్ గా ‘జైనాబ్’ తో అక్కినేని అఖిల్ నిశ్చితార్ధం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
గంజాయి, ఎండిఎంఎ, ఎల్ఎస్డీ బాస్ట్స్ ఏది కావాలన్నా ఇస్తామని కస్టమర్లకు ఫోన్లు చేస్తూ డ్రగ్స్ అమ్మకాలు జరిపే ముఠాను మంగళవారం ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. గోల్కండ ఎక్సైజ్ పోలీస్ పరిధిలోని షేక్‌పేట్, టోలీ చౌక్ ప్రాంతాల్లో కార్లలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టిఎఫ్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక కారులో ఒక యువతి, ఒక వ్యక్తి కూర్చోని ఉన్నారు. మరో వ్యక్తి స్కూటీపై వచ్చి గంజాయి ప్యాకెట్‌ను కారులో ఉన్న వ్యక్తులకు ఇస్తూ ఉండగా.. ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్కూటీపై వచ్చిన వ్యక్తి వద్ద నుంచి ఒక కిలో గంజాయి స్వాధీనం చేసుకున్న, అనంతరం కారులో తనిఖీలు నిర్వహించగా అందులో 1.7 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దింతో మొత్తంగా 2.7 కిలోల గంజాయి, 11గ్రాముల ఎండిఎంఎ, 3 ఎల్ఎస్డీ బాస్ట్స్ లభించాయి.
Also Read: Youngest Players IPL: 2025 వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కులు వీళ్లే..
గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరుపుతూ పట్టుబడిన నిందితుల్లో సాయి బాబు, వెంకటరెడ్డి, సోనియా ఎలిషా అలియాస్ ప్రియాంకలను అరెస్టు చేసి గోల్కండ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. డ్రగ్స్‌ను ఎస్టిఎఫ్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్, ఎస్సై శ్రీనివాస్, శ్రీకాంత్, సాయి కుమార్, కరణ్, ప్రసాద్, తరుణి, నిఖిల్ లు పట్టుకున్నారు. ఒకే చోటు మూడు రకాల డ్రగ్స్‌ను అమ్మకాలు జరుపుతున్న నిందితులను పట్టుకున్న ఎస్టిఎఫ్ సిబ్బందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్‌రెడ్డి, అసిస్టేంట్ డైరెక్టర్ అనిల్ కుమార్‌రెడ్డి అభినందించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!