హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్ ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో కన్జ్యూమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లను బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి డ్రై గాంజాతో పాటు మొదటిసారిగా ఓషియన్ గాంజా పట్టుబడింది. సుమారు 72 లక్షల రూపాయల డ్రై గాంజా, ఓషియన్ గాంజాతో పాటు మొబైల్ ఫోన్లు, కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Read Also: Encounter: సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై దాడి.. 11 మంది ఉగ్రవాదులు హతం
పెడ్లర్లు బండారి సునీల్, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ అక్రంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 170 గ్రాముల ఓషియన్ గాంజా, 9 కిలోల డ్రై గాంజాను పోలీసులు రికవరీ చేశారు. డార్క్ వెబ్ ఆధారంగా కన్జ్యూమర్లకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన బండారి సునీల్ కర్ణాటక పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. స్నాప్ చాట్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్‌ల ద్వారా వినియోగదారులకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు పెడ్లర్లు.
Read Also: Kamala Orange: కమలా పండుతో ఈ రోగాలు పరార్!