Site icon NTV Telugu

US: అమెరికా అధ్యక్ష భవనం దగ్గర ప్రమాదం.. కారు డ్రైవర్ మృతి

Wit

Wit

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష భవనం దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. వైట్‌హౌస్‌ గేటును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే కారు డ్రైవర్ మృతిచెందాడు. అయితే ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేనట్లుగా సీక్రెట్ సర్వీస్‌ ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది.

ఇది కూడా చదవండి: Kerala: బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన యువతి.. కొచ్చిలో మరో ఘటన..

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ కాంప్లెక్స్‌ బయట గేటును ఓ కారు బలంగా ఢీకొంది. ఆ ఘటనలో వాహన డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందినట్లు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ వెల్లడించింది. శనివారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చిందని… కాంప్లెక్స్‌ బయట గేటును బలంగా ఢీకొట్టింది అని వైట్‌ హౌస్‌ కార్యాలయం వెల్లడించింది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయం చేసే ప్రయత్నం చేయగా.. డ్రైవర్‌ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారని తెలిపింది.

ఇది కూడా చదవండి: Geetha Bhagath: హీరో కడతాడని చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్

ఈ ఘటనపై పోలీసులు, స్థానిక యంత్రాంగంతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం వెల్లడించింది. భద్రతకు సంబంధించి ఎటువంటి ముప్పు లేదని పేర్కొంది. ఇదిలా ఉంటే వైట్‌హౌస్‌ దగ్గర ఈ తరహా ఘటన జనవరిలోనూ చోటుచేసుకుంది. ఇదే గేటును ఓ వాహనం ఢీ కొట్టింది. ఇలా కొంతకాలంగా వైట్‌హౌస్‌ దగ్గర జరుగుతోన్న చొరబాట్ల నేపథ్యంలో భారీ ఫెన్సింగ్‌ను ఇటీవల ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే డ్రైవర్‌ను అధికారులు ఇంకా గుర్తించలేదు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన సమయంలో అధ్యక్షుడు బిడెన్ వాషింగ్టన్ DCలో లేరని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.

ఇది కూడా చదవండి: Devendra Fadnavis: కసబ్ గురించి కాంగ్రెస్ ఆందోళన.. 26/11 దాడులపై రాజకీయం..

Exit mobile version