Plastic Bottles Water: మన గ్రహం అనేక విషయాల వల్ల కలుషితమైంది. వాటిలో ఒకటి మైక్రోప్లాస్టిక్స్. మన ఆహారం, నీటి సరఫరాలో ఎక్కువ భాగం కనిపించని ప్లాస్టిక్ చిన్న కణాలు ఉన్నాయి. ఇవి మానవులకు అత్యంత హానికరమైన పదార్ధాలలో ఒకటిగా పేర్కొనబడ్డాయి. ఇది మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇకపోతే తాజాగా, మైక్రోప్లాస్టిక్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్లాస్టిక్ సీసాల నుండి తాగడం ద్వారా మైక్రోప్లాస్టిక్‌లు రక్తప్రవాహంలోకి ప్రవేశించడం వల్ల రక్తపోటు పెరుగుతుందని కనుగొన్నారు. ఇవి గుండె ఆరోగ్యం, హార్మోన్ అసమతుల్యత, క్యాన్సర్ లాంటి సమస్యలతో ముడిపడి ఉన్నాయి.
Jaishankar: షేక్ హసీనా గురించి యూకే విదేశాంగ కార్యదర్శితో జయశంకర్ ఫోన్ సంభాషణ
ఈ కొత్త అధ్యయనాన్ని ఆస్ట్రియాలోని డానుబే ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ విభాగం నిర్వహించింది. దీన్ని మైక్రోప్లాస్టిక్స్ జర్నల్ లో ప్రచురించబడింది . పరిశోధకుల బృందం ప్లాస్టిక్ సీసాలో నీటిని తాగే వారిని., తాగని వారి రక్తపోటు విషయంపై పరిశోధనలు చేసినప్పుడు ఈ విషయాన్నీ కనుగొన్నారు. ఇక ఈ పరిశోధనల సమయంలో అద్భుతమైన పోకడలు గమనించబడ్డాయి. అధ్యయనం ఫలితాలు మొదటిసారిగా, ప్లాస్టిక్ వాడకం తగ్గింపు రక్తపోటును తగ్గించగలదని సూచిస్తున్నాయి. బహుశా రక్తప్రవాహంలో ప్లాస్టిక్ కణాల పరిమాణం తగ్గడం వల్ల కావచ్చు అని బృందం అధ్యయనంలో రాసింది.
Paris Olympic 2024: ఒలింపిక్స్ లో భారత హాకీ ప్రస్థానం ఇలా..
ప్లాస్టిక్ వినియోగం తగ్గడంతో రక్తపోటు తగ్గుతుందని కనుగొన్న వాటి ఆధారంగా, రక్తప్రవాహంలో ఉన్న ప్లాస్టిక్ కణాలు అధిక రక్తపోటుకు దోహదం చేస్తాయని మేము ఊహిస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ బాటిళ్లలో ప్యాక్ చేసిన పానీయాలకు దూరంగా ఉండాలని వారు తేల్చారు. కొన్ని సంవత్సరాల క్రితం, శాస్త్రవేత్తలు సీసాలలో ప్యాక్ చేసిన ద్రవాల ద్వారా ప్రతి వారం 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్‌లు మానవుల రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తున్నాయని కనుగొన్నారు. మైక్రోప్లాస్టిక్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి వివరించిన మార్గాలలో పంపు నీటిని మరిగించడం, ఫిల్టర్ చేయడం లాంటి చేయడం వల్ల మైక్రోప్లాస్టిక్స్ (నానోప్లాస్టిక్స్) ఉనికిని దాదాపు 90 శాతం తగ్గించగలవు అని నిర్ధారణ చేసారు.