Jasmine Tea: ఈ టీని రోజూ తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. ముఖ్యంగా దానికి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్లె పూవు వాసన అంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళలకు జడలో మల్లెపూలు పెట్టుకోవడమంటే చాలా ఇష్టం. అయితే మల్లెలను దేవుడి కోసం కాకుండా.. జడలో పెట్టుకోవడానికి కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడవచ్చు. వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే మల్లెపూలతో చేసిన టీని రోజూ తాగితే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. జాస్మిన్ టీని మల్లెపూలతో తయారు చేయరు.. కానీ ఇది మల్లె పువ్వుల సువాసనతో ఉంటుంది. తేయాకునీ, మల్లెపూలను ప్రత్యేక పద్ధతుల్లో డీహైడ్రేట్ చేసి ఈ టీని తయారు చేస్తారు. మల్లెపువ్వు టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
PM Modi: ప్రధాని మోడీకి తిరుగులేని ఆమోదం.. 75 శాతం “అప్రూవల్ రేటింగ్” ఉన్నట్లు తాజా సర్వే..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
బరువు తగ్గిస్తుంది..
జాస్మిన్ టీ చెడు బ్యాక్టీరియాతో అంతమొందించి.. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. దీనిలో ఉండే క్యాటెచిన్స్, ఇవి కొవ్వును కరిగించే లక్షణాలను కలిగి ఉంటాయి. దీంతో బరువు తగ్గడంలో సహాయపడతాయి. జాస్మిన్ టీలో ఔషధ గుణాలు.. అరోమాథెరపీకి సమర్థవంతమైన పద్ధతి.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
జాస్మిన్ టీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా.. జాస్మిన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సంబంధిత నొప్పులను తగ్గిస్తాయి. జాస్మిన్ టీ తాగడం వల్ల మీరు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తున్నప్పుడు మధుమేహాన్ని నివారించవచ్చు లేదా నియంత్రించవచ్చు.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
జాస్మిన్ టీలో ఫాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. ఈ టీలో ప్రత్యేకించి శక్తివంతమైన కాటెచిన్ ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ ఉంటుంది. ఇది బరువు తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంచడానికి, గుండె, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. EGCGలో బ్లడ్-లిపిడ్-తగ్గించే ప్రభావాలు ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది..
జాస్మిన్ టీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. దీనిలో ఉండే కెఫీన్ మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. డోపమైన్, సెరోటోనిన్ వంటి ఇతర మానసిక స్థితిని మెరుగుపరిచే న్యూరోట్రాన్స్మిటర్లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. దీనిలో అమైనో యాసిడ్ ఎల్-థియానైన్ కలిగి ఉంది. ఇవి.. గామా-అమినోబ్యూట్రిక్ యాసిడ్ (GABA) విడుదలను ప్రేరేపిస్తుంది.. అంతేకాకుండా.. మిమ్మల్ని రిలాక్స్డ్గా ఉంచి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!