NTV Telugu Site icon

Accident: పోలీసు బండి కింద పడి బైకర్ల సజీవ దహనం

Accident

Accident

Accident: బీహార్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. పోలీసు సిబ్బందితో వెళ్తున్న బస్సు చప్రా సివాన్ హైవేపై బైకును ఢీకొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. పోలీస్ బస్సును ఢీకొట్టిన సమయంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బైకు పై వస్తున్న వారంతా మంటల్లోనే కాలిపోయారు. ఆ బస్సులో బీహార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఆ బస్సు డయోరియా గ్రామ సమీపంలోకి రాగానే బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టడంతో వారిలో ఒకరు బైక్ తో సహా బస్సు కింద ఇరుక్కు పోయారు. దీంతో ఒక్క సారిగా ఇంధన ట్యాంకు పేలి మంటలు చుట్టుముట్టాయి. ముగ్గురు ఆ మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. బస్సులో మంటలు రావడంతో పోలీసు అధికారులు దిగిపోయారు. సితాబ్ధియారాలో దివంగత రాజకీయ నాయకుడు జయప్రకాశ్ నారాయణ జయంతి వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

Read Also: Cyber Attack : సైబరాబాద్‌లో కొత్త రకం సైబర్ అటాక్

ఇది ఇలా వుంటే… చలి తీవ్రతను తట్టుకునేందుకు ఓ రైతు పొలంలో వేసుకున్న చలిమంటే అతని చితిమంట అయ్యింది. నిర్మల్‌ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బైంసా మండలం ఎగ్గాంకు చెందిన భూమన్న.. పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఎప్పట్లాగే సోమవారం రాత్రి కూడా పొలానికి కాపలాగా వెళ్లాడు. చలి అధికంగా ఉండటంతో పొలంలోని షెడ్డులో చలి మంట వేసుకుని దానికి పక్కనే మంచంపై నిద్రించాడు. అయితే, అర్ధరాత్రి తర్వాత ఆ చలి మంట రగలి షెడ్డుకు నిప్పు అంటుకుంది. షెడ్డులోని కట్టెలు, గడ్డి వంటివి అంటుకుని మంటలు వ్యాపించాయి. వాటిల్లోనే భూమన్న కూడా కాలిపోయాడు. మంగళవారం ఉదయం వ్యవసాయ పనులు కోసం అటుగా వచ్చిన కొందరు జరిగిన ప్రమాదాన్ని గుర్తించి భూమన్న కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.