Accident: పోలీసు బండి కింద పడి బైకర్ల సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accident: బీహార్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. పోలీసు సిబ్బందితో వెళ్తున్న బస్సు చప్రా సివాన్ హైవేపై బైకును ఢీకొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. పోలీస్ బస్సును ఢీకొట్టిన సమయంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బైకు పై వస్తున్న వారంతా మంటల్లోనే కాలిపోయారు. ఆ బస్సులో బీహార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఆ బస్సు డయోరియా గ్రామ సమీపంలోకి రాగానే బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టడంతో వారిలో ఒకరు బైక్ తో సహా బస్సు కింద ఇరుక్కు పోయారు. దీంతో ఒక్క సారిగా ఇంధన ట్యాంకు పేలి మంటలు చుట్టుముట్టాయి. ముగ్గురు ఆ మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. బస్సులో మంటలు రావడంతో పోలీసు అధికారులు దిగిపోయారు. సితాబ్ధియారాలో దివంగత రాజకీయ నాయకుడు జయప్రకాశ్ నారాయణ జయంతి వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Cyber Attack : సైబరాబాద్‌లో కొత్త రకం సైబర్ అటాక్
Also Read
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ఇది ఇలా వుంటే… చలి తీవ్రతను తట్టుకునేందుకు ఓ రైతు పొలంలో వేసుకున్న చలిమంటే అతని చితిమంట అయ్యింది. నిర్మల్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బైంసా మండలం ఎగ్గాంకు చెందిన భూమన్న.. పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఎప్పట్లాగే సోమవారం రాత్రి కూడా పొలానికి కాపలాగా వెళ్లాడు. చలి అధికంగా ఉండటంతో పొలంలోని షెడ్డులో చలి మంట వేసుకుని దానికి పక్కనే మంచంపై నిద్రించాడు. అయితే, అర్ధరాత్రి తర్వాత ఆ చలి మంట రగలి షెడ్డుకు నిప్పు అంటుకుంది. షెడ్డులోని కట్టెలు, గడ్డి వంటివి అంటుకుని మంటలు వ్యాపించాయి. వాటిల్లోనే భూమన్న కూడా కాలిపోయాడు. మంగళవారం ఉదయం వ్యవసాయ పనులు కోసం అటుగా వచ్చిన కొందరు జరిగిన ప్రమాదాన్ని గుర్తించి భూమన్న కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?