Site icon NTV Telugu

DPDP Bill – 2023: చట్టంగా మారిన DPDP..

Dpdp

Dpdp

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. దీంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఇదే విషయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో తెలిపారు. “DPDP చట్టంగా మారింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.” అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. డిపిడిపి బిల్లు.. ఆగస్టు 7న లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందగా.. ఆగస్టు 9న రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈరోజు (ఆగస్టు 12)న రాష్ట్రపతి దీనికి తుది ఆమోదం తెలిపారు.

Tiger Nageswara Rao : టైగర్ కి టైమొచ్చింది.. రెడీ అవ్వండి!

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భారతదేశ పౌరుల డాటాను ఉపయోగించే విధానాన్ని నిర్దేశిస్తూ ఈ బిల్లును రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే.. డిజిటల్ వ్యక్తిగత డేటాను నిర్వహించడం, దానిని సురక్షితంగా ఉంచడం, వ్యక్తి యొక్క హక్కులను సమతుల్యం చేయడం. భారతదేశంలో డిజిటల్ వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్‌కు ఈ చట్టం వర్తిస్తుంది. ఇందులో ఆన్‌లైన్ మరియు డిజిటైజ్ చేయబడిన ఆఫ్‌లైన్ డేటా ఉంటుంది. ఈ చట్టం భారతదేశం వెలుపల నివసించే వారికి కూడా వర్తిస్తుంది. అంతేకాకుండా.. భారతీయ పౌరుల గోప్యతను కాపాడుతుంది. ఈ చట్టంలో ఒక వ్యక్తి యొక్క డిజిటల్ డేటాను ఉపయోగించడం మరియు రక్షించడంలో విఫలమైన సంస్థలపై రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనను రూపొందించారు. దీంతో ప్రజల డేటాను భద్రపరచడానికి టెక్ కంపెనీలు ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మీ డేటా లీక్ అయితే లేదా మీ డిజిటల్ డేటా దుర్వినియోగం చేయబడితే వెంటనే డేటా ప్రొటెక్షన్ బోర్డ్‌కు తెలియజేస్తే.. చట్టం ప్రకారం చర్య తీసుకుంటారు.

MP Arvind : కల్వకుంట్ల కుటుంబం అంతా దొంగలే

ఈ చట్టంలో వినియోగదారు డేటాను ఉపయోగించే సోషల్ మీడియా సంస్థ.. ఒక వ్యక్తి యొక్క డేటాను భద్రపరచడంలో విఫలమైతే వెంటనే చర్యలు తీసుకుంటారు. అందుకోసమని.. కంపెనీలు వ్యక్తిగత డేటాను రక్షించుకోవాలి. డేటా దొంగిలించబడకుండా చూసుకోవడానికి కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లీకేజీ అయితే కంపెనీలు డేటా ప్రొటెక్షన్ బోర్డు, సంబంధిత వినియోగదారులకు తెలియజేయాలి. ఈ చట్టం తర్వాత ఇప్పుడు కంపెనీలు డేటా ప్రొటెక్షన్ అధికారిని నియమించుకోవాలి. అంతేకాకుండా వినియోగదారులకు ఈ చట్టం గురించి తెలియజేయాలి.

Exit mobile version