Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Doug Bracewell Banned For Two Years After Failing Drug Test

Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్‌వెల్.. రెండేళ్ల నిషేధం

Published Date :April 25, 2026 , 2:25 pm
By Sudhakar Ravula
Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్‌వెల్.. రెండేళ్ల నిషేధం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Doug Bracewell Banned: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ డగ్‌ బ్రేస్‌వెల్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. డ్రగ్ టెస్ట్‌లో విఫలమైన కారణంగా ఆయనపై రెండేళ్ల నిషేధం విధించారు. ఈ నిషేధం 2025 నవంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చి 2027 నవంబర్ 23 వరకు కొనసాగనుంది. అయితే, 2025లో ఇంగ్లాండ్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ సందర్భంగా బ్రేస్‌వెల్ నిషేధిత మాదకద్రవ్యం కొకైన్ తీసుకున్నట్లు అంగీకరించాడు. Essex County Cricket Club తరఫున ఆడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చెల్మ్స్‌ఫోర్డ్‌లో Somerset County Cricket Clubతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతను డ్రగ్ వినియోగించినట్లు నివేదికలు వెల్లడించాయి.

Read Also: Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది

Also Read

  • Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
  • Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
  • Punjab: ‘‘పంజాబ్‌ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
  • Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన

మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత, రెండో రోజు మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు బ్రేస్‌వెల్ కొకైన్ తీసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ మ్యాచ్‌లో పాల్గొని తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీశాడు. ఆ మ్యాచ్‌లో ఎసెక్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఘటనను ఇంగ్లాండ్ క్రికెట్ నియంత్రణ సంస్థ తీవ్రంగా పరిగణించి రెండేళ్ల నిషేధం విధించింది. ఈ నిర్ణయానికి తమ మద్దతు ఉందని ఎసెక్స్ క్లబ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆటగాళ్ల నుంచి అత్యున్నత వృత్తిపరమైన ప్రవర్తనను ఆశిస్తున్నామని, అయితే బ్రేస్‌వెల్ పునరావాసానికి మద్దతు ఇస్తామని క్లబ్ పేర్కొంది.

డగ్ బ్రేస్‌వెల్‌కు ఇది తొలి వివాదం కాదు. గతంలో కూడా పలుమార్లు వివాదాల్లో నిలిచాడు. 2014లో న్యూజిలాండ్ దేశీయ టోర్నమెంట్ Super Smash సందర్భంగా కొకైన్ పరీక్షలో విఫలమై ఒక నెల నిషేధం ఎదుర్కొన్నాడు. 2017లో మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో దోషిగా తేలి 100 గంటల సామాజిక సేవ శిక్షను పొందాడు. అప్పట్లో అతని కారులో మద్యం పరిమాణం అనుమతించిన పరిమితికి మూడింతలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2012లో నేపియర్‌లోని ఓ బార్‌లో జరిగిన గొడవకు సంబంధించి కూడా ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్నాడు. మైదానంలో ప్రతిభతో గుర్తింపు పొందిన బ్రేస్‌వెల్, మైదానం వెలుపల వివాదాలతోనూ వార్తల్లో నిలిచాడు. తాజా నిషేధం అతని కెరీర్ ముగింపుపై మరో మచ్చగా మారిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket ban news
  • Cricket Latest News
  • Doug Bracewell banned
  • Doug Bracewell cocaine case
  • Doug Bracewell drug test

తాజావార్తలు

  • Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్‌వెల్.. రెండేళ్ల నిషేధం

  • Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్‌ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

  • Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది

  • Punjab: ‘‘పంజాబ్‌ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions