ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇష్మార్ట్ శంకర్ సినిమాని తెరకెక్కించారు.అప్పటి వరకు వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న రామ్ పోతినేని, పూరి జగన్నాద్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని అదిరిపోయే క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా అద్భుత విజయం సాధించడమే కాక భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.ఈ సినిమా తరువాత దర్శకుడు పూరిజగన్నాధ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో భారీ బడ్జెట్ తో లైగర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ కావడమే కాకుండా దర్శకుడు పూరిజగన్నాధ్ కు అనుకోని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీనితో దర్శకుడు పూరి జగన్నాద్ కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా వున్నారు. స్టార్ హీరోలు ఎవరూ కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు.
కానీ ఇటీవల రామ్ పోతినేని పూరి జగన్నాద్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వల్ రాబోతుంది.దాదాపు నాలుగేళ్ళ తర్వాత వీరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని ఇటీవలే మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.. ఈ సినిమాకు ”డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ ను కూడా ప్రకటించారు.. ప్రకటించిన కొద్దిరోజులకు ఈ సినిమాను అధికారికంగా లాంచ్ కూడా చేసారు.జులై 12 నుండి రెగ్యులర్ షూట్ కూడా సమొదలు అయ్యింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనుండగా ఇందులో ఒక ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకోవాలని పూరీ ఆలోచిస్తున్నట్లు సమాచారం… మరి ఈ బాలీవుడ్ స్టార్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 8న విడుదల కానుండగా ఛార్మి కౌర్ తో కలిసి పూరీ కనెక్ట్స్ పై విష్ణు రెడ్డి ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పూరిజగన్నాద్ మరోసారి అదిరిపోయే హిట్ కొట్టాలని చూస్తున్నాడు.