Double Ismart: ఆదివారం నాడు డబుల్ ఇస్మార్ట్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సినీ బృందం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా సంబంధించిన సినీ ప్రముఖులందరు హాజరయ్యారు. ఈ సందర్బంగా హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. హాయ్ వరంగల్.., మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు.. మీ అభిమానం చూస్తుంటే ఒక కలలా వుంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ జర్నీ వెరీ స్పెషల్. ఇందులో ” జన్నత్ ” లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ పూరికి చాలా థాంక్యూ. ఛార్మి చాలా కేరింగ్ చూసుకున్నారు. రామ్ తో కలిసిపని చేయడం హానర్. ” మార్ ముంత చోడ్ చింతా”, ” స్టెప్పా మార్ ” లాంటి పాటలు చేయడం బ్లెస్సింగ్. రామ్ అమెజింగ్ పర్శన్. అలీ, టెంపర్ వంశీ, గెటప్ శ్రీను అందరికీ పేరుపేరునా థాంక్స్. ఆగస్ట్ 15న సినిమా వస్తోంది. డబుల్ కామెడీ, డబుల్ యాక్షన్, డబుల్ మ్యాజిక్ లా వుంటుంది. మార్ ముంత చోడ్ చింతా అని మాట్లాడారు.
Double Ismart: ఒళ్లు దగ్గరపెట్టుకొని తీసిన సినిమా “డబుల్ ఇస్మార్ట్”.. డైరెక్టర్ పూరి జగన్నాద్..
ఇక పూరి కనెక్ట్స్ సిఈవో విష్ మాట్లాడుతూ.. నమస్తే వరంగల్.. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరి సపోర్ట్ వలన ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. ఛార్మి సపోర్ట్ కి థాంక్స్. ఛార్మి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. సంజయ్ బాబా ఐలవ్ యూ. ఆయనతో కలిసి పని చేయడం డ్రీం కం ట్రూ. రామ్ అన్న హ్యాట్సప్. సినిమా చూసిన అందరూ ఇదే మాట అంటారు. ఎక్స్ ట్రార్డినరీ గా పెర్ఫార్ చేశారు. పూరి గారితో పని చేసే ప్రతి ఒక్కరూ మన సినిమా అని పని చేస్తారు. పూరి కలిసి వుండటం, ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ ని సెలబ్రేట్ చేసుకుందాం అంటూ మాట్లాడారు.