డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు.. జస్ట్ 2 లక్షల రూపాయలు మాత్రమే..!! ఈ ఆఫర్ మీకు కూడా టెంప్టింగ్‌గా అనిపిస్తోంది కదూ..!! అవును మరి అలాంటిదే బంపర్ ఆఫర్..!! ఇలా నమ్మించే దాదాపు 100 మందిని బురిడీ కొట్టించారు నలుగురు కేటుగాళ్లు. ఏకంగా కోటి రూపాయలు కొట్టేసి నకిలీ పట్టాలు చేతిలో పెట్టారు. పోలీసులు పట్టుకోవడంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు.
సొంత ఇల్లు ఎవరికైనా ఓ కల. సొంత ఇల్లు ఉండాలి.. ఇది ఎవరికైనా ఓ కల..డబుల్ బెడ్‌రూమ్ వస్తుందంటే ఎగిరి గంతేస్తారు. ఇక సర్కారు నుంచి డబుల్ బెడ్‌రూమ్ వస్తుందంటే ఎగిరి గంతేస్తారు… ఏకంగా పట్టా చేతిలో పెడతామంటే సంతోషమే వేరు.
అది కూడా జస్ట్ చిన్న మొత్తం కడితే.. ఏకంగా పట్టా చేతిలో పెడతామంటే.. ఆ సంతోషానికి అవధులు ఉండవు.. ఇలా గ్యాస్ కొట్టే ఒకడు హైదరాబాద్‌లో దాదాపు 100 మందిని మోసం చేశారు. అందులో సొంత బంధువులు కూడా ఉన్నారు.మున్సిపల్, రెవెన్యూ శాఖలో తెలిసిన వారు ఉన్నారని చెప్పి మోసం. బండ్లగూడలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి మహమ్మద్ అహ్మద్, అంజాద్, కౌసర్ అలీ, రాజశేఖర్ జనాన్ని మోసం చేశారు. అతి తక్కువ ధరకే వాటిని ఇప్పిస్తామని చెప్పారు. పైగా మున్సిపల్, రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్న వారు ఉన్నారని.. తాము చెబితే అందరికీ డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ వస్తాయని నమ్మించారు. ఇందులో భాగంగానే కొన్ని పట్టాలని తీసుకుని వచ్చారు. ఇవి చూసి బంధుమిత్రులందరూ కూడా డబుల్ బెడ్ రూమ్ ప్లాట్లు వస్తాయని ఆశించారు…
Swiss Banks: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు మూడు రెట్లు పెరిగాయ్
రెవెన్యూ అధికారుల సంతకాల ఫోర్జరీ . మరోవైపు ఈ ముఠా.. జనాన్ని నమ్మించేందుకు ఒక యాప్ ద్వారా నకిలీ ఇళ్ల పట్టాలను తయారు చేశారు. అంతే కాదు తమను నమ్మి డబ్బులు కట్టిన 11 మందికి పట్టాలను అందజేశారు. ఇలా తక్కువ ధరకే ఇళ్లు వస్తున్నాయనే ఆశతో మరింత మంది తలా ఒక్కంటికి రూ. 2 లక్షల వరకు చెల్లించారు. ఇలా దాదాపు 100 మంది వద్ద కోటి రూపాయల వరకు వసూలు చేశారు కేటుగాళ్లు. బండ్లగూడలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను చూపించి ఇక్కడే నివాసం ఉండే విధంగా కేటాయింపులు జరిపిస్తామని చెప్పి వారి నుంచి డబ్బులు తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి.. వారికి నకిలీ పట్టాలు కూడా ఇచ్చేశారు…. కానీ వన్ ఫైన్ మార్నింగ్.. రెండు పడక గదుల ఇళ్లు వచ్చాయని నమ్మిన వాళ్లు అక్కడికి వెళ్లి ఆరా తీయగా నకిలీ పట్టాలు సృష్టించి మోసం చేసినట్లు గ్రహించారు బాధితులు.
దీంతో బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బండ్లగూడ పోలీసులు విచారణ ప్రారంభించారు. బండ్లగూడ పోలీసులు టాస్క్ఫోర్స్ పోలీసు అధికారులు కలిసి జాయింట్ గా ఆపరేషన్ నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహకారంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ పంపించారు… సొంతింటి కోసం కలలు కంటున్న వారు.. ఇలాంటి బ్రోకర్లను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి వారినే కాదు.. చోటా మోటా రాజకీయ నాయకులను సైతం నమ్మొద్దని వార్నింగ్ ఇచ్చారు..
Rajasthan: ప్రియురాలి గొంతు కోసి చంపి పాతి పెట్టిన ప్రియుడు.. కట్‌చేస్తే…
