వదర బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేసి దాతృత్వం చాటుకుంటున్నారు.
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన తెలుగువారు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు చేయూతనిస్తున్నారు. వదర బాధితులను అందే సహాయ చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ 9 రోజులుగా విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి పలువురు విరాళాల చెక్కులను అందజేశారు.