Site icon NTV Telugu

One Big Beautiful Bill: ట్రంప్ కు భారీ విజయం.. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఘన విజయం. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను గురువారం రాత్రి ప్రతినిధుల సభ 218-214 ఓట్ల తేడాతో ఆమోదించింది. సెనేట్, ప్రతినిధుల సభ నుంచి ఆమోదం పొందిన తర్వాత, ఈ బిల్లును ఇప్పుడు అధ్యక్షుడి సంతకం కోసం పంపారు. బిల్లుపై ఓటింగ్ సమయంలో, ఇద్దరు రిపబ్లికన్ ఎంపీలు పార్టీ లైన్ నుంచి తప్పుకుని డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. రెండు సభల నుంచి ఈ బిల్లు ఆమోదం పొందడం పట్ల డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. నేను లక్షలాది కుటుంబాలను ‘డెత్ ట్యాక్స్’ నుంచి విముక్తి చేశానని తెలిపారు.

Also Read:Supreme Court Collegium: ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

బిల్లు ఆమోదం పొందిన తర్వాత, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విలేకరులతో మాట్లాడుతూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తన భారీ పన్ను మినహాయింపులు, ఖర్చు కోత బిల్లుపై సంతకం చేయనున్నట్లు చెప్పారు. జూలై 4 స్వాతంత్రత్య దినోత్సవ సెలవుదినం నాడు చట్టంగా సంతకం చేయడానికి ట్రంప్ డెస్క్‌పై ఇది ఉండనుంది. 800 పేజీలకు పైగా ఉన్న ఈ బిల్లును ఆమోదించడానికి ట్రంప్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ బిల్లు కోసం రిపబ్లికన్ పార్టీ నాయకులు రాత్రింబవళ్లు కష్టపడాల్సి వచ్చింది. తగినంత ఓట్లు పొందడానికి ట్రంప్ వ్యక్తిగతంగా హోల్డౌట్‌లపై ఒత్తిడి తెచ్చారు.

Also Read:Pawan Kalyan : అతనికి పవన్ కల్యాణ్ థాంక్స్.. పోస్ట్ వైరల్..

ఈ బిల్లులో పన్ను కోతలు, సైనిక బడ్జెట్, రక్షణ, ఇంధన ఉత్పత్తికి ఖర్చులను పెంచడం, అలాగే ఆరోగ్యం, పోషకాహార కార్యక్రమాలలో కోతలు వంటి ప్రధాన నిబంధనలు ఉన్నాయి. ఈ బిల్లు అక్రమ వలసదారులను పెద్ద ఎత్తున బహిష్కరించడానికి ఖర్చులను పెంచడానికి కూడా సంబంధించినది. ఇతర ప్రతిపక్షాలు ఈ ఖర్చు దేశంలోని ఆరోగ్యం, విద్య వంటి రంగాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే పారిశ్రామికవేత్త ఎలోన్ మస్క్‌తో సహా పెద్ద వర్గం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు 2017 పన్ను కోతలు, ఉద్యోగాల చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయడంతో పాటు తన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే దిశగా కీలక అడుగుగా అధికార వర్గం భావిస్తోంది. అయితే, బిల్లు ఆమోదం పొందడం కాంగ్రెస్‌లో విభేదాలను సృష్టించింది.

Exit mobile version