Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో యాక్షన్ సీన్లు, విజువల్స్, వీఎఫ్ ఎక్స్ బాగానే ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్ లో వాయిస్ ఓవర్ గురించే చర్చ జరుగుతోంది. ఆ వాయిస్ ఓవర్ ఎవరిదా అని ఆరా తీయగా నటుడు అర్జున్ దాస్ ది అని తెలిసింది. ఆయనకు తాజాగా పవన్ కల్యాణ్ థాంక్స్ చెబుతూ పోస్ట్ చేశారు. అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ ట్రైలర్ మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
Read Also : KCR Health Bulletin: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్
దీంతో పవన్ స్పెషల్ పోస్ట్ చేశారు. ‘డియర్ బ్రదర్ అర్జున్ దాస్.. నేను అరుదుగా సాయం అడుగుతుంటాను. నీ వాయిస్ లో మ్యాజిక్, మెలోడీ ఉన్నాయి’ అంటూ పోస్ట్ చేశారు పవన్. అర్జున్ దాస్ ప్రస్తుతం ఓజీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీరమ్లలు జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు కూడా మొదలు పెట్టేశారు. త్వరలోనే పవన్ కల్యాన్ ఈ ప్రమోషన్లలో పాల్గొనే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది.
Read Also : Ameerkhan : ‘కూలీ’లో అమీర్ ఖాన్.. ట్విస్ట్ ఇస్తారా..?