NTV Telugu Site icon

Donald Trump: నేను ఎన్నికల్లో గెలవకుండా కుట్రలు చేస్తున్నారు..

Donald Trump

Donald Trump

Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మరోసారి గెలవకుండా కుట్రలు చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు​. రాజకీయ ప్రేరణతోనే తనపై కక్ష సాధిస్తున్నారన్నారు. సుమారు 370 మిలియన్ డాలర్ల పరువునష్టం కేసులో విచారణ సందర్భంగా ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ఈ కేసులో తమకే పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆర్థర్​ ఎంగోరాన్​పైనా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూయార్క్​ అటార్నీ జనరల్ ​తో కలిసి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సోషల్​ మీడియాలో ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు.

Read Also: Shaheen Shah Afridi: కెప్టెన్‌గా మొదటి మ్యాచ్.. మొదటి వికెట్ కూడా!

అయితే, అంతకుముందు విచారణ సందర్భంగా ట్రంప్ పై వేసిన పిటిషన్లను తిరస్కరించాలని ఆయన తరఫు లాయర్ క్రిస్​ కిస్ కోరారు. ​రియల్​ ఎస్టేట్​ వ్యాపారంలో జోక్యం చేసుకోవడానికి అటార్నీ జనరల్ తన అపరిమిత అధికారాలను ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపణ చేశారు. న్యూయార్క్​ అటార్నీ జనరల్​ లెటిటియా జేమ్స్​ ట్రంప్ ​పై 370 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశారు. రాష్ట్రంలో వ్యాపారం చేయకుండా నిషేధం విధించాలని కోరారు.

Read Also: Karimnagar: ఆ కోడి నాదే ఇచ్చేయండి.. అంత సీన్ లేదన్న ఆర్టీసీ అధికారులు

మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్​ ట్రంప్​ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరో రిపబ్లిక్​ పోటీ దారులైన నిక్కీ హేలీ, రాన్​ డిసాంటిన్​ మధ్య జరిగిన చర్చ కంటే ట్రంప్​ ఇంటర్వ్యూనే ఎక్కువ మంది ప్రజలు చూస్తున్నారు. బుధవారం ఓ​ న్యూస్​ ఛానల్​లో టౌన్​ హాల్​లో జరిగిన ట్రంప్​ ప్రసంగాన్ని 4.3 మిలియన్ల మంది చూశారు. ట్రంప్​ చర్చను అర్ధరాత్రి సమయంలో తిరిగి ప్రసారం చేయగా మరో 1.4 మిలియన్లు మంది చూశారని సదరు న్యూస్ సంస్థ ప్రకటించింది.

Show comments