Donald Trump: ప్రభుత్వ ఉద్యోగులను రాజీనామా కోరుతూ 8 నెలల జీతం ఆఫర్ ఎందుకు ఆఫర్ చేసాడంటే?
- ప్రభుత్వ ఉద్యోగులను రాజీనామా కోరిన అమెరికా ప్రెసిడెంట్.
- ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించడమే లక్ష్యంగా నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు గమనిస్తే, ఆయన కొంత మంది ఉద్యోగులను తక్షణమే విరమించుకోమని కోరాడు. ఈ క్రమంలో ఫెడరల్ ఉద్యోగులు (ప్రభుత్వ ఉద్యోగులు) స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు ఆసక్తి చూపితే వారికి 8 నెలల జీతం ఇచ్చే ఆఫర్‌ను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం, ఫిబ్రవరి 6లోపు ఉద్యోగులు రాజీనామా చేస్తే వారిని తక్షణమే పరిగణనలోకి తీసుకుంటూ 8 నెలల జీతం అందించబడుతుంది. ఈ విషయాన్ని ట్రంప్ అధికారిక కార్యాలయం అయిన వైట్ హౌజ్ నుండి ఒక మెమో ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనను దాదాపు 20 లక్షల మందికి పంపినట్లు సమాచారం. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు సంకేతాలు సూచిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయంతో సుమారు 100 బిలియన్ డాలర్లు ఆదా చేయగలదని నివేదికలు పేర్కొంటున్నాయి.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఫిబ్రవరి 6లోపు స్వచ్ఛందంగా ఉద్యోగాల నుంచి వైదొలగాలనుకునే ఉద్యోగులకు ఒకేసారి 8 నెలల జీతం ఇవ్వనున్నట్లు ట్రంప్ తన అధికారి సమావేశంలో వెల్లడించారు. ఈ నిర్ణయం ప్రకారం, దాదాపు చాలామంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్-19 పాండెమిక్ అనంతరం అనేక మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పని చేసేందుకు అలవాటుపడ్డారు. అయితే, ఇప్పుడు ఈ విధానంపై ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాల్సిందే.
Also Read: SSMB 29: మహేష్ – ప్రియాంక విత్ బాలీవుడ్ హీరో.. సైలెంటుగా పని కానిస్తున్న జక్కన్న
అయితే, ఈ నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై నెగటివ్ ప్రభావం చూపవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న భారీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం వల్ల సంబంధిత విభాగాల్లో ఆటంకాలను తీసుకురావచ్చు. దీంతో పలు విభాగాలు, సేవలు దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు అమెరికా ప్రభుత్వానికి పెద్ద అవగాహనకారక మార్పులను తీసుకురావడం అనేది ఆర్థిక వ్యవస్థలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!