హైదరాబాద్ లో వీధికుక్కలు వీర విహారం సృష్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న వీధి కుక్కల దాడిలో ఓ పసిబాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. కొన్ని చోట్ల మనుషులపై ఎగబడి దాడికి పాల్పడుతున్నాయి. ఇది రేబిస్ వ్యాధికి దారితీస్తుంది. చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. వీధికుక్కల బెడదను నియంత్రించడంలో ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి.
Medigadda Project: కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణ చేస్తాం..
కాగా.. జంటనగరాల్లో కుక్క కాటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం ఫీవర్ హాస్పిటల్ లో డిసెంబర్ నెలలో 2442 కేసులు నమోదయ్యాయి. దాదాపుగా రోజుకి 80 నుంచి 100 కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి సోకితే మరణం తప్పదు.. రేబిస్ కి చికిత్స లేదు. అయితే ఫీవర్ ఆస్పత్రిలో వారానికి రెండు రేబిస్ కేసులు నమోదు అవుతున్నాయి. వీధి కుక్కల వల్ల ఎక్కువగా కుక్క కాటుకు గురవుతున్నారు. జనాల్లో కుక్క కాటుకు వాక్సినేషన్ ఉందనే అవగాహన లేకపోవడమే మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు వైద్యులు. నగరంలో రేబిస్ వార్డ్ కేవలం ఫీవర్ ఆస్పత్రిలో ఉంది.. ఇక్కడ ఎప్పటికీ రేబిస్ పేషంట్స్ అడ్మిషన్ జరుగుతూనే ఉన్నాయి.
Purandeswari: జనసేన-బీజేపీ-టీడీపీ పొత్తు..! పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
డిసెంబర్ నెలలో ఫీవర్ ఆస్పత్రిలో నమోదయిన కుక్క కాటు కేసులు వివరాలు…
1475 పురుషులు..
536 మహిళలు..
316- బాలురు..
115- బాలికలు.
మొత్తం 28 రోజుల్లో 2442 కేసులు నమోదయ్యాయి.